ఫిర్యాదు దారులతో మర్యాదగా నడుచుకోండి
విశాఖ సిపి శంకబ్రత భాగ్చీ
విశాలాంధ్ర -ఆనందపురం : వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. బుధవారం సాయంత్రం సిపి ఆనందపురం పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి స్టేషన్ లో వాళ్ళు ఫైళ్లను పరిశీలించారు అనంతరం, పరిసరాలను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆనుకొని ఉన్న ప్రాంతాలను వ్యర్థాలతో నింపకుండా, ఆయా ఖాళీ ప్రాంతాలను శుభ్రము చేయించి, మొక్కలు నాటాలని ఆదేశించారు, స్టేషన్ తో పాటుగా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు, సమస్యలు ఉన్నా తాము ఇచ్చిన 7995095799 నెంబరుకు తెలియపరచమని తెలిపారు, అనంతరం స్టేషనుకు ఫిర్యాదులకు వచ్చే ఫిర్యాదుదారులతో స్పందిస్తున్న తీరు తెలుసుకొన్నారు. కేబ్లూ కోట్స్, ట్రాకోట్స్ పని తీరు పరిశీలించారు. క్రైమ్ ప్రివెన్షన్, డిటెక్షన్, ప్రొసీక్యూషన్ కు ఎంతో ఉపయోగపడే సీసీటీవీ కెమెరాలు మరిన్ని వినియోగించు విధముగా చర్యలు తీసుకోవాలని తెలిపారు, రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ ప్రతి కదలిక ఎల్లవేళలా పరిశీలించాలన్నారు. గంజాయి రవాణాదారులను అరెస్టు చేయాలనీ, స్టేషన్ల పరిధిలో ఒక్క గంజాయి పెడ్లర్ కూడా ఉండరాదని స్పష్టమైన అదేశాలు జారీ చేశారు, విధులలో ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకోబడతాయనీ కావునా ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని ఈ సందర్భముగా తెలియ జేశారు .