Friday, December 8, 2023
Friday, December 8, 2023

రోటరీ క్లబ్ ద్వారా ఆశ్రమ వసతి గృహ విద్యార్థినిలకు పరుపులు పంపిణీ

విశాలాంధ్ర – చింతపల్లి :- మన్య ప్రాంతంలో శీతాకాలం ప్రారంభం కావడంతో విశాఖపట్నం కి చెందిన రోటరీ క్లబ్ వారు స్థానిక గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ వసతి గృహంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినులకు 100 పరుపులు పంపిణీ చేశారు. స్థానిక వసతి గృహ ప్రధానోపాధ్యాయుడు కొండలరావు, వసతి గృహ అధికారిని నూకరత్నం ల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ మన్య ప్రాంతంలో శీతల వాతావరణానికి తోడు ప్రస్తుతం శీతాకాలం ప్రారంభం కావడం వలన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకూడదు అనే సదుద్దేశంతో సేవా దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఇందులో భాగంగా విద్యార్థులకు పరుపులు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులతో పాటు, ఆశ్రమ వసతి గృహ ఉపాధ్యాయునిలు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img