విశాలాంధ్ర -ఆనందపురం : ఆనందపురం మండలం శొంట్యం జిల్లా పరిషత్ హైస్కూల్ లో జరిగిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ లో గెలుపొందిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు చైర్మన్ లోకిరెడ్డి రాంబాబు , వైస్ చైర్మన్ కనకమహాలక్ష్మి, మిగిలిన డైరెక్టర్లు అందరికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి కోరుకొండ మూర్తి, బూత్ కన్వీనర్ బోద్దాపు గోవింద్, తదితరులు పాల్గొన్నారు.