రాంబిల్లి-విశాలాంధ్ర : యలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జ్ సుందరపు విజయ్ కుమార్ అధ్యక్షతన గురువారం నాడు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీని ఎలా గద్దె దించాలి,అదే విధంగా తమ పార్టీలను ఎలా అధికారంలోకి తెచ్చుకోవాలనే విషయాలపై కమిటీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.అనంతరం వైసిపి చెందిన అచ్యుతాపురం మండలం ఎస్ ఈ జెడ్ కాలనీ నుంచి మాజీ వార్డు సభ్యులు రుత్తల కనకారావు, పంచాయతీ శివారు కోనాంపాలెం గ్రామం నుంచి పైల రమ్యారావులు జనసేన పార్టీలోకి చేరారు. వీరికి నియోజకవర్గ ఇన్చార్జ్ సుందరపు విజయ్ కుమార్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, జనసైనికులు,కార్యకర్తలు పాల్గొన్నారు.