విశాలాంధ్ర -ఆనందపురం : ఆనందపురం, మండలం పరిధిలో పంటల పరిశీలన నిమిత్తం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం , అనకాపల్లి నుండి విచ్చేసిన ప్రధాన శాస్త్రవేత్తలు డా .ఏం .విశాలాక్షి , డా.ఏ .శిరీష గ, విశాఖపట్నం జిల్లా వనరుల కేంద్రం సి హెచ్. సుబ్రమణ్యం , వ్యసాయ అధికారి ch.సురేష్ , మండల వ్యవసాయ అధికారి సి.హెచ్ .సంధ్య రత్న ప్రభ బృందంగా ఆనందపురం మండలంలోని బోని గొట్టిపల్లి గ్రామంలో వరి పొలాలను సందర్శించడం జరిగింది , వరి లో పొట్టదశలో యూరియా తో పాటు పోటాష్ ఎకరానికి 20 కేజీ లు వేసుకోవాలని మరియు పొట్టదశ నుంచి గింజ గట్టిపడే వరకు నీరు 5 సెంటిమీటర్లు ఉండాలని తెలిపారు.అదే విదంగా సుడిదోమ ఆకుముడత నివారణకు ఎసి ఫేట్ 300 గ్రాములు ఎకరానికి సుడిదోమ ఉదృతి ఎక్కువగా ఉంటే పైమెట్రిజోల్ 120 గ్రాములు ఎకరానికి వాడుకోవాలని తెలియజేసారు.