Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

మహిళా మార్ట్ ను సందర్శించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ

బి రాజేష్ ,ముఖ్య కార్యనిర్వహణాధికారి ఇంతియాజ్

విశాలాంధ్ర ఆనందపురం : మహిళ సాదికారత మహిళలకు చేయూత తో పాటు అన్ని రంగాల్లో ప్రభుత్వం ఇస్తున్న గుర్తింపు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళ చేయూత మార్ట్ను గురువారం పలువురు అధికారులు సందర్శించారు
ఆనందపురంమండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైయస్సార్ చేయూత మహిళ మార్ట్ ను స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి ,రాజేష్ ముఖ్యకార్య నిర్వహణ అధికారి ఇంతియాజ్ గురువారం ఉదయం సందర్శించారు ఈ సందర్భంగా వారు మార్ట్ లో ఉన్న వస్తువులు పై ధరలు తనిఖీ చేసి నేరుగా కొనుగోలుదారులతో మాట్లాడి ప్రతి ఒక్కరూ కూడా ప వస్తువులను కొనుగోలు చేసుకుని నాణ్యమైన మార్కెట్ రేటుకే ఇక్కడ వస్తువులు అందిస్తున్నామని మహిళా సాధికార చేయూత మార్ట్ ను అందరూ సద్వినియోగం చేసుకొని స్వయం సహాయక సంఘాలు కంపెనీలతో ఏర్పాటు చేసిన అందరూ అభివృద్ధికి సహకరించాలని తెలిపారు అనంతరం ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వీఆర్ ఎండ్ ఆర్ డి బి రాజేష్, సెర్ప్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఏ ఎం ఇంతియాజ్, శ్రీనిధి ఎండి నాంచారయ్య, పి డి డిఆర్డిఏ శోభారాణి ఎంపీడీవో అడపాలవరాజు భీమిలి ఏరియా కోఆర్డినేటర్ కే. సత్యం నాయుడు, ఏపిఎంనాగభూషణం మహిళా మార్ట్ సభ్యులు తదితరులుపాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img