విశాలాంధ్ర – ఆనందపురం : కలకత్తాలో జరిగిన వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు నిరసనగా మండలంలోని నీలకుండీలలో గల శ్రీ సాయి స్వామి వివేకానంద పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల వైస్ ప్రిన్సిపల్ పాకల శ్రీవల్లి ప్రియ మాట్లాడుతూ… సమాజంలో స్త్రీలకు భద్రత లేకుండా పోతుందని, హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం “వుయ్ వాంట్ జస్టిస్” అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినులు అరుణ, మంజుల, సంతోషి, దమయంతి, దివ్య, సునీత, ఎర్నమ్మ, పూర్ణిమ, వనజ, మాధవి, కాంచన, విద్యార్థులు పాల్గొన్నారు