విశాఖలో సోమవారం ఆవిష్కరణ
విశాలాంధ్ర- విశాఖపట్నం: ద్విచక్, త్రిచక్ర వాహనాల సెగ్మెంట్లో అంతర్జాతీయ దిగ్గజం టీవీస్ మోటర్ కంపెనీ (టీవీఎస్ఎం) తమ సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110ని ఆవిష్కరించింది.
విశాఖపట్నంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో టీవీఎస్ జూపిటర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టీవీఎస్ మోటార్ కంపెనీ బిజినెస్ హెడ్ అనిరుద్ధ హాల్దర్ మాట్లాడుతూ
తదుపరి తరం ఇంజిన్, భవిష్యత్ కాలపు ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్లు అనేకం ఈ స్కూటర్ లో పొందుపరిచామన్నారు. మరింత ఎక్కువ స్టయిల్, మైలేజ్, పనితీరు, సౌకర్యం, సౌలభ్యం, భద్రత, టెక్నాలజీ ఇలా అన్నింటిలోనూ మరింత అధికంగా అందించాలనే లక్ష్యాన్ని ప్రతిఫలించే విధంగా సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110 తీర్చిదిద్దబడిందని తెలిపారు.
టీవీఎస్ జూపిటర్ అనేక మంది వాహనదార్లకు ఒక తిరుగులేని నేస్తంగా కొనసాగుతోందని, 65 లక్షల మంది పైగా కస్టమర్ల వైవిధ్య అవసరాలను నిరంతరం నెరవేరుస్తోందని చెప్పారు.
గత దశాబ్దకాలంగా టీవీఎస్ మోటర్ స్కూటర్ పోర్ట్ ఫోలియోకి టీవీఎస్ జూపిటర్ 110 అనేది ఒక లంగరుగా ఉంటోందన్నారు. ఇన్నేళ్లలో 65 లక్షల కుటుంబాల నమ్మకాన్ని చూరగొందని, తద్వారా ఇది భారతదేశంలోనే అతి పెద్ద ఆటోమోటివ్ బ్రాండ్స్ ఒకటిగా ఎదిగిందన్నారు. సరికొత్తగా తీర్చిదిద్దిన ఆల్ న్యూ టీవీఎస్ జూపిటర్ జాదా కా ఫాయ్
నినాదంతో తీసుకువచ్చామన్నారు.
ఆన్ డిమాండ్ టార్క్, మెరుగైన ఇందన ఆదా, గణనీయంగా వినియోగించుకోతగిన స్థలం, సమకాలీన డిజైన్ వంటి ప్రత్యేకతలను అందించగలిగే సామర్ధ్యాల కారణంగా ఈ స్కూటర్ విశిష్టమైనదిగా నిలుస్తుందన్నారు.
టీవీఎస్ జూపిటర్ 110లో శక్తిమంతమైన 113.3 సీ సీ సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ ఇంజిన్ ఉందని. ఆటో స్టార్ట్-స్టాప్ ఫంక్షనాలిటీ ఐఎసీ (ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్) గల ఇంటిలిజెంట్ ఇగ్నీషన్ సిస్టం ఉందన్నారు. ఓవర్టేక్ చేసేటప్పుడు, ఎత్తు ఎక్కేటప్పుడు బ్యాటరీ నుంచి శక్తిని తీసుకుని పనితీరును మరింత మెరుగుపర్చేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని చెప్పారు. డబుల్ హెల్మెట్ స్టోరేజ్, మెటల్ మ్యాక్స్ బాడీ, ఫాలో మీ
హెడ్ల్యాంప్స్, టర్న్ సిగ్నల్ ల్యాంప్ రెస్ట్, ఎమర్జెన్సీ ట్రిక్ వార్నింగ్ సాంకేతికత, కాల్, ఎస్ఎంఎస్, వాయిస్ అసిస్ట్ల నేవిగేషన్, ఫైండ్ మై వెహికల్
మరెన్నో ఫీచర్లతో పూర్తి స్థాయి డిజిటల్ బ్లూటూత్ ఎనేబుల్డ్ క్లస్టర్ కూడా ఉందని చెప్పారు.
సరికొత్త టీవీస్ జూపిటర్ 110
డ్రం, డ్రం అలాయ్, డ్రం ఎస్ ఎక్స్ సీ, డిస్క్ ఎస్ ఎక్స్ సీ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది అన్నారు.
భద్రత, సౌకర్యంపరంగా అత్యుత్తమ ఫీచర్లతో ఉందని,
డాన్ బ్లూ మ్యాట్, గెలాక్టిక్ కాపర్ మ్యాట్, టైటానియం గ్రే మ్యాట్, స్టార్లైట్ బ్లూ గ్లోస్, లూనార్ వైట్ గ్లోస్ రంగుల్లో ఈ స్కూటరు లభిస్తుందని చెప్పారు. దీని ధర అందరికీ అందుబాటులో ఉండేలా రూ.77.200/- (ఎక్సపోరూం, ఆంధ్ర ప్రదేశ్) నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.