సేవాసమితి సభ్యులను అభినందించిన ఎల్వీ
విశాలాంధ్ర-పార్వతీపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ముఖ్యకార్యదర్శి యల్.వి.సుబ్రహ్మణ్యం మంగళవారం నాడు జిల్లాఆసుపత్రి అవరణకోగత 649 రోజులుగా జరుగుతున్న జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి నిత్య అన్నదాన కార్యక్రమంను ఆకస్మికంగా సందర్శించారు.రెండు రోజులుగా పార్వతీపురం ప్రాంతంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పేదప్రజలకు,గర్భిణీ స్త్రీలకు, రోగులకు, రోగుల సహాయకులకు, ఆసుపత్రిలో చిరు ఉద్యోగులకు రోజుకు వందనుండి నూట యాభై మందికి తమ విరాళాలతో జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి సభ్యులు ఉచితభోజనం అందిస్తున్న విషయం తెలుసుకుని ఆయన విచ్చేశారు.అమ్మ అన్న ప్రసాద వితరణను చేస్తున్న పార్వతీపురం అమ్మకుటుంబ సభ్యులను కలిసి స్వయంగా అన్నప్రసాద వితరణలో ఆయన పాల్గొని ఆయన చేతుల మీదుగా అన్న ప్రసాదం అందించడం చేపట్టారు.జిల్లెళ్ళమూడి అమ్మకు ఎంతో ప్రీతిపాత్రమైన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోఇక్కడ కొనసాగిస్తున్న అమ్మ టుంబసభ్యులు(పార్వతీపురంప్రాంతం) అందరినీ అభినందిస్తూ ,అందరిపై అమ్మ ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని శీర్వదించారు.తానుకూడా జిల్లెళ్ళమూడి అమ్మఆశీర్వాదం పొందిన వాడినేనని ,అడుగడుగునా నన్ను అమ్మే పాడుతుందని,అమ్మతో తనకు ఎన్నో అనుభూతులు,అనుభవాలు ఉన్నాయని చెప్పారు..నేను ఐఏఎస్ అవుతానని తనకు తెలియదని , అమ్మే నాభవిష్యత్ ను నాకు ముందుగానే తెలియజేసిన మహాజ్ఞాని జిల్లెళ్ళమూడి అమ్మని, తనఅనుభవాన్ని పంచుకున్నారు.అప్పట్లో పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా ఎల్వీ సుబ్రహ్మణ్యం పనిచేసే సమయంలో ఆయన గిరిజనాభివృద్ధికీ పెద్దఎత్తున కృషిచేసిన సంగతి తెలిసిందే. ఈకార్యక్రమంలో ప్రముఖకవి, కథా రచయిత గంటేడ.గౌరునాయుడు, జిల్లా ఆసుపత్రి సూపరిశీటెండెంట్ డాక్టరు వాగ్దేవి,జట్టు ఆశ్రమ వ్యవస్థాపకులు డొల్లు పారినాయుడు,డి.గణపతిరావు,బలగ సత్యన్నారాయణ, జి. అప్పలరాజు, పి.చిన్నంనాయుడు, ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు కిషోర్,జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి సభ్యులు గంటేడ చిన్నం నాయుడు, గంటేడ సోమేశ్వరరావు,
దవల గౌరీప్రసాద్, భవిరిపూడి శ్రీరామ మూర్తి నాయుడు,బి.అడివినాయుడు.
శీలంకి త్రినాధరావు,బి.తిరుపతిరావు, రంభ గంగునాయుడు
వై. శ్రీను పి.గౌరీశంకరరావు తదితరులు పాల్గొన్నారు.