మోదీ తొమ్మిదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య,
-దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ల సంస్థలకు అమ్మకాలు
-దేశ సంపదను దొంగల చేతిలో పెట్టిన మోడీ
-రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిన జగన్ననీ నమ్మవద్దు
-రాష్ట్రంలో బిజెపికి మద్దతు పలికే పార్టీలన్ని కమ్యూనిస్టులకు శత్రువులే:
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య
విశాలాంధ్ర,పార్వతీపురం: మన్యం జిల్లాలో గుమ్మలక్షిమీపురంలో సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో బహిరంగసభ మోదీ తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి శూన్యమని, ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే, రక్షణ, ఎల్ఐసి, బ్యాంకులు, ఓడరేవులు, వ్యవసాయం కార్పోరేట్ వ్యక్తులైన ఆదాని అంబానీలకు గంపగుతేగా అమ్మేస్తున్నారని.. గోరక్షణ పేరుతో నిత్యం మైనార్టీలను, దళితులపై దాడులు తెగబడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్యఅన్నారు. మంగళవారం మణ్యం జిల్లాలో మన్యం ప్రాంతం గుమ్మ లక్ష్మిపురం మండల కేంద్రంలో కనిగిరి క్లబ్ రోడ్లో సిపిఐ, సిపిఎం ప్రచార బేరి కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పాల్గొన్న ప్రసంగించారు. బిజెపి అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి మోదీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని ఎద్దేవా చేశారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలుక తీసి పేదల అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తానని హామీ ఇచ్చారని ఏమైందని ప్రశ్నించారు. దేశ సంపదను ఆదాని అంబానీ లాంటి దొంగల చేతిలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ హటావో ..దేశంకు బచావో నినాదంతో ప్రజలందరూ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో కోట్లకు పడగలెత్తిన కుబేరులకు తప్ప సామాన్య ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని రైతులు, కార్మికులు, యువకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మోదీ పాలనపై విసికెత్తిపోయారన్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి బిజెపి ప్రభుత్వానికి మద్దతు పలికి ప్రజలపై పన్ను భారాలు వేయటమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో విభజన చట్టాలు, ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి వంటి సమస్యలపై బిజెపిని నిలదీసే సత్తా లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలకు విద్యుత్ చార్జీలు, చెత్త చార్జీలు, ఆస్తి పన్ను, బస్సు చార్జీలు ఏడుసార్లు పెంచిన జగన్మోహన్ రెడ్డి.. నిన్నెందుకు రాష్ట్ర ప్రజలు నమ్మాలని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసి సంక్షేమం లేకుండా రాష్ట్రాన్ని 40 ఏళ్ల అభివృద్ధి వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బిజెపికి మద్దతు పలికే పార్టీలన్నీ కమ్యూనిస్టులకు శత్రువులే అని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను కమ్యూనిస్టులు నిరంతరం వ్యతిరేకిస్తారన్నారు.
ఏరాజకీయ పార్టీ నాయకుడైన రాష్ట్రంలో పర్యటనకు రావచ్చునని అది రాజ్యాంగం కల్పించిన హక్కుని గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో దళితులపై హత్యలు దారుణాలు మారణహోమాలు జరిగితే మాట్లాడని మంత్రి ఆదిమూలపు సురేష్ చంద్రబాబు పర్యటనలో చొక్కా విప్పి రోడ్డుపై బైఠాయించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులైన అచ్చన్న ,సుధాకర్ ,జడ్జి రామకృష్ణలను దారుణంగా హింసించి హత్య చేస్తే మాట్లాడని ఆదిమూలపు సురేష్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సురేష్ మంత్రి పదవిని కాపాడుకునేందుకే ఇలాంటి డ్రామాలకు తెరలేపారన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీ.కామేశ్వరరావుమాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలనలో పూర్తిగా వైఫల్యం చెందాయని ప్రజలు వచ్చే ఎన్నికల్లో మోడీ జగన్ కు తగిన బుద్ధి చెబుతారన్నారు. జిల్లాలో పశ్చిమ ప్రాంత ఆశాజ్యోతి అయిన సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వాలు అవినీతిమయం చేశాయని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేసి పేదలకు స్థానికంగా జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సీపీఎం రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు కె. సుబ్బరావమ్మ, సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు.జిల్లా సహాయ కార్యదర్శి తోటజీవన్న, జిల్లాసమితిసభ్యులు పువ్వుల ప్రసాద్ ,మోహనరావు, సీపీఎం నేతలు రెడ్డి వేణు,ఇందిరా,అవినాష్, మండంగి రమణ తదితరులు పాల్గొన్నారు