విశాలాంధ్ర,సీతానగరం: స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎంపిడిఓగా భాధ్యతలు చేపట్టిన ఎంఎల్ఎన్ ప్రసాద్ ను మండలంలోని 35గ్రామ పంచాయతీ కార్యదర్శులు శనివారంనాడు కలసి పుష్ప గుచ్చెంలు అందజేసి అభినందనలు తెలిపారు. ఎంపిడిఓకు అన్ని విధాల సహకారాన్ని అందించి,గ్రామాల్లో ఆయన సూచనలు మేరకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా ఎంపిపిగా జాయిన్ అయిన ప్రసాద్ మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే జోగారావును, పలువురు ప్రజా ప్రతినిదులను, అధికారులని కలిశారు. ప్రసాద్ ను మండలంలోని వివిధ శాఖల అధికారులు,సర్పంచులు, ఎంపిటిసిలు,నాయకులు కలసి అభినందనలు తెలిపారు. ఆయనను 21గ్రామ సచివాలయాలకు చెందిన డిజిటల్, వెల్ఫేర్, ఇంజినీరింగ్,
ఎంఎస్పీలు తదితరులు కలిసి అభినందనలు తెలిపారు.