Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటుపై అవగాహన ప్లెక్సీ ఏర్పాటు

విశాలాంధ్ర/సీతానగరం: ఈనెల 13న జరగనున్న పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలో ఓటుహక్కును ఎలా వినియోగించుకోవాలన్న విధానంపై అందరికీ అవగాహన కోసం స్తానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్లెక్సీను ఎంపిడిఓ కృష్ణ మహేష్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగం దీనిద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. ఈకార్యక్రమంలో ఈఓపిఅర్డి వర్మ, పరిపాలన అధికారి ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు గూర్చి దృష్టి సారించాలని ఎంపిడిఓ చెప్పారు.పంచాయతీ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు.సకాలంలో ఓటు స్లిప్పులు పట్టభద్రుల ఓటర్లకు అందజేయాలని సూచించారు. ఓటర్లు ఓటు వేయు విధానంపై వారికి అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వారి ఉత్తర్వుల అమలు చేయాలని కోరారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img