Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఐదు రోజుల‌పాటు ఆధార్ స్పెషల్ డ్రైవ్

ప్ర‌తీఒక్క‌రూ ఆధార్ అప్‌డేట్ చేయించుకోవాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్య‌కుమారి

విశాలాంధ్ర -విజ‌య‌న‌గ‌రం :

           ప్ర‌తీఒక్క‌రూ త‌మ‌ ఆధార్ అప్‌డేట్ చేయించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కోరారు. దీనికోసం జిల్లాలో ఐదు రోజుల‌పాటు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు.  జిల్లాలోని అన్ని మున్సిపాల్టీలు, మండ‌లాల్లో ఈ నెల 20,21, 27, 28,29 తేదీలలో ఐదు రోజులు ప్ర‌త్యేకంగా  ఆధార్ క్యాంప్ ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ అవ‌కాశాన్నిప్ర‌జ‌లంతా వినియోగించుకొని త‌మ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాల‌ని కోరారు.
           ఆధార్ స్పెష‌ల్ డ్రైవ్ పై ఎంపిడిఓలు ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ కోసం తప్పనిసరిగా మహిళా పోలీస్/ ఏదేని కార్యదర్శిని నియ‌మించాల‌ని,  మండలములో చురుకుగా పనిచేసే ఇద్దరు లేక ముగ్గురు వ‌లంటీర్ల‌ను, డాక్యుమెంటేష‌న్‌ చేయుటకు ఆధార్ క్యాంప్ లో నియమించాల‌ని సూచించారు. ఒక్కొక్క ఆధార్ సెంటర్లో తప్పనిసరిగా రోజుకు 25-30 సర్విస్ లు పూర్తి చేయాల‌ని ఆదేశించారు. జిల్లాలో ఇంతకుముందు నిర్వ‌హించిన‌ స్పెషల్ డ్రైవ్లలో 45 నుంచి 50 సర్వీసులు చేసిన ఆధార్ సెంటర్లు కూడా ఉన్నాయ‌ని, వాటిని దృష్టిలో ఉంచుకొని సేవ‌ల‌ను మ‌రింత మెరుగ్గా అందించాల‌ని సూచించారు. ఆధార్ క్యాంప్ లకు ప్రజలను సమీకరించే విధంగా, పంచాయితీ కార్యదర్శి, వలంటీర్ల‌కు ముందుగానే త‌గిన ఆదేశాల‌ను జారీ చేయాల‌ని సూచించారు. మండలంలో ఎక్కువగా  ఆధార్ క్యాంప్ అవసరమైన గ్రామములను ముందస్తుగా గుర్తించి, అక్కడ ఆధార్ క్యాంప్ లు నిర్వర్తించే  విధంగా చర్యలు తీసుకోవాల‌న్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేయ‌డానికి అధిక ప్రాధాన్య‌త‌ ఇవ్వాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img