Monday, June 5, 2023
Monday, June 5, 2023

ఘనంగా జరుగుతున్న దశమ వార్షికోత్సవ మహోత్సవములు

విశాలాంధ్ర,సీతానగరం:మండల కేంద్రంలోని సీతానగరంలో సువర్ణముఖినదీ తీరానగల రుక్మిణీ సత్యభామసమేత శ్రీవేణుగోపాల స్వామి దేవాలయంతోపాటు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలలో దశమ వార్షిక మహోత్సవములు మంగళవారం ఘనంగా జరిగాయి. మేలతాళాలతో, వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.నిత్యారాధనం, అష్టోత్తర కలశాభిషేకం, తిరువీధి, విశ్వక్షేనారాధన, పుణ్యావచనం, అంకురారోపణం, తీర్ధ ప్రసాద గోష్టను నిర్వహించారు.సీతానగరం తో పాటు వివిధప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున విచ్చేసి పూజలు నిర్వహించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు .దేవాలయ ప్రాంగణమును, గుడిలోపల, గుడి వెలుపల విద్యుద్దీపాలతో అలంకరణ చేపట్టారు. బుధవారంనిత్యారాధనం, అగ్నిప్రతిష్ఠ, పతాకప్రతిష్ఠ తీర్ధ ప్రసాద గోష్ట, సుదర్శన నారసింహ యాగం తీర్ధ ప్రసాద గోష్ట, నిత్య హోమములు ఉంటాయని అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు తెలిపారు. నాలుగు రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో తనతో పాటు ఆమంచి శ్రీనివాసాచార్యులు, పీసపాటి రామానుజా చార్యులు, కె.మురారి,బృందావనం ఉదయ కృష్ణమాచార్యులు, శ్రీనివాసా చార్యులు పాల్గొని పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img