Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

విశాలాంధ్ర,పార్వతీపురం: మన్యం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు.జ్యోతిరావు పూలే చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకటరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి మహనీయుల ఆలోచనలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఎస్. కృష్ణ,జిల్లా సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి ఎస్.సాంబయ్య, మన్యంజిల్లా జెఏసిఅధ్యక్షులుజి.శ్రీరామ్మూర్తి,అధికారులు, బిసి సంక్షేమ శాఖ వసతి గృహాల వార్డెన్లు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img