విశాలాంధ్ర,పార్వతీపురం: మన్యం జిల్లా మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడులను ఎమ్మెల్యే ఆలజింగి జోగారావు కలిసి పుష్ప గుచ్చెంలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఏర్పాటు కాబడిన జిల్లాను ఏడాది కాలంలో మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను, పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంలో, జిల్లా శాంతిభద్రత పరిరక్షణ మరియు స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటు చేయడంలో విశేష కృషిచేసినందుకు అభినందించారు.మరింత అభివృద్ధి పథంలో నడపాలని కోరారు. ఆయనతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి, పార్టీ ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, స్థానిక వార్డు కౌన్సిలర్ సభ్యులు చీకటి అనురాధ, చిన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఏడాది పూర్తి చేసుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీలను జిల్లాలోని అధికారులు, ఉద్యోగులు కూడా కలసి అభినందనలు తెలిపారు.