Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

జోగమ్మపేట కెజిబివిలో అరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

విశాలాంధ్ర,సీతానగరం; మండలంలోని జోగమ్మపేట కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలలో 2023-24 విద్యా సంవత్సరానికిగాను 6వతరగతిలో బాలికల ప్రవేశానికి మరియు 7,8,9. తరగతుల్లో మిగులసీట్ల భర్తీకి ధరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనదని పాఠశాల స్పెషల్ ఆఫీసర్ గొట్టాపు హరిత తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ధరఖాస్తులను ఈనెల 21నుండి ఏప్రిల్ 20వరకు ఆన్ లైనులో చేసుకోవాలని కోరారు. అనాధులు,బడి lబయట పిల్లలు, డ్రాఫౌట్ బాలికలు, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీలు తల్లిదండ్రుల వలస వెళ్ళిపోయిన బాలికలు, పేదరిక రేఖకు దిగువగల బాలికలు ధరఖాస్తు చేసుకొనుటకు అర్హులన్నారు.
ధరఖాస్తులు http://apkgbv.apcfss.in/ వెబ్ సైటు ద్వారా పొందవచ్చునని చెప్పారు. ఎంపికైన
విద్యార్దులకు ఫోన్ ద్వారా మెసేజ్ పంపబడుతుందన్నారు. మెసేజ్ అందిన వారు వారికి కేటాయించిన కెజిబివి లకు వెళ్ళిజాయిన్ కావాలని కోరారు. మరిన్ని వివరాల కోసం మండలాల్లో ఉండే కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో ప్రత్యేకాధికారిణీలను సంప్రదించాలని స్పెషల్ ఆఫీసర్ హరిత కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img