విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న కె.కృష్ణమూర్తి మంగళవారం నాడు (హెచ్.సి1273) నాయిబ్రాహ్మణ వయో వృద్ధులకు, వితంతువులకు చీరలు, దుప్పట్లు, బియ్యం,నిత్యవసర సరుకులను పంపిణి చేశారు.ప్రతీనెల తన జీతంలో కొంతమొత్తాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తూ కృష్ణమూర్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు పలువురికి ఆదర్శంగా ఉంటున్నాయి. తనజీతంలో దీన్ని ఎల్లపుడూ కొనసాగిస్తానని క్రిష్ణమూర్తి చెప్పారు. కృష్ణమూర్తి నాయీ బ్రాహ్మణులకు చేసిన వితరణని సంఘానికి చెందిన పదవీ విరమణ చేసిన ఎంపిడిఓ కెల్ల కృష్ణారావు, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పెంకి శివ ప్రసాద్,పి శంకరరావు,ఆర్టీసీ డిపార్ట్మెంట్ సంఘము మండల అధ్యక్షులు, బి.వెంకటరమణ జిల్లాకోశాధికారి, పి సూర్యనారాయణ సెక్రటరీ, బోటు రామకృష్ణ ,మరికొంతమంది పెద్దలు అభినందించారు.కృష్ణమూర్తి చేసిన సేవలను గుర్తించిన నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు అతన్ని ఘనంగా సత్కరించారు. పోలిస్ శాఖలో పనిచేస్తున్న కృష్ణమూర్తి సాదారణ వ్యక్తిగా ఉండి, ఆయన చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని వారంతా కొనియాడారు.