విశాలాంధ్ర, పార్వతీపురం: దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లు నిజమైన దేశభక్తులని ప్రముఖ కథారచయిత, కవి గంటేడ గౌరునాయుడు, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి లోచర్ల రమేష్ లు అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలో గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గిరిజన సామాజిక భవనంలో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల వర్ధంతి సభను నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ యువత, విద్యార్థులు సామాజిక అంశాలపై స్పందించాలని కోరారు. భగత్ సింగ్ లాంటి వారి గురించి అధ్యయనం చేసేందుకు యువత ముందుకు రావాలని కోరారు.విద్యార్థులు సామాజిక భాద్యతతో ముందుకు సాగాలని ,లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విశ్రాంత ఉపాధ్యాయులు చుక్క పారినాయుడు మాష్టారు మాట్లాడుతూ యువతను తప్పుదోవ పట్టించే సినిమా, సీరియల్స్ కు దూరంగా ఉండాలని ,మంచి పౌరులుగా ,సంఘజీవిగా ఉండాలని తెలిపారు. ఈకార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాలక రంజిత్ కుమార్,చందు, గిరిజన నిరుద్యోగ సంఘం నాయకులు, ఆరిక ప్రభాకర్, బొండపల్లి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని భగత్ సింగ్ విగ్రహంవద్ద పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.