విశాలాంధ్ర-సీతానగరం: మండలంలోని నిడగల్లు గ్రామంలో అతి పురాతన శివాలయాన్ని పూర్తిగా తొలగించి పునర్నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారు. ఎమ్మెల్యే జోగారావు సహాకారంతో దేవాదాయ ధర్మాదాయశాఖ కూడా ఈశివాలయ నిర్మాణానికి 40లక్షల రూపాయలు మంజూరు చేయగా దానిలో 13లక్షల రూపాయలను విడుదల చేసారని కమిటీ సభ్యులు తెలిపారు. దీంతో పాటు గ్రామంలోఉన్నవారు, వివిధ ప్రాంతాలలో ఉన్నవారు కూడా ఆలయ పునర్నిర్మాణంకు పెద్ద ఎత్తున సహకారాన్ని అందించారు. దీంతో ఆలయాన్ని త్వరితగతిన నిర్మించే చర్యలు తీసుకుంటున్నారు. ఆలయాన్ని పూర్తిగా తొలగించి పునర్నిర్మాణ పనులు చేస్తున్న కమిటీ సభ్యులు ఆలయంలో అప్పట్లో పూర్వీకులు ప్రతిష్టించిన శివాలయ లింగాన్నిమాత్రం తీసివేయకుండా పూజలు యధావిధిగా నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని త్వరితగతిన పూర్తి చేసే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని గ్రామపెద్దలు మరడాన శివున్నాయుడు, ప్రసాద్ పాత్రుడు, గాజాపు శ్రీనివాసరావు, తోడబండి సూర్యనారాయణ తదితరులు తెలిపారు. ఆలయంలో శివాలయవిగ్రహాన్ని తొలగించక యదావిధిగా పూజలు చేస్తున్నామని తెలిపారు. అందరి సహకారంతో త్వరితగతిన నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేయాలని దృష్టి సారించామన్నారు.