విశాలాంధ్ర,సీతానగరం: మండల కేంద్రంలోని సువర్ణముఖినదీ తీరాన
వెలసిల్లిన బొబ్బిలి రాజుల ఆరాధ్యదైవం రుక్మిణీ సత్యభామసమేత శ్రీవేణుగోపాల స్వామి దేవాలయంతోపాటు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలలో దశమ వార్షిక మహోత్సవములు మంగళవారం (నేటినుంచి) నుండి జరుపబడునని ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, నిర్వహకులు చెలికాని గోపాల కృష్ణ లు తెలిపారు. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీశోభకృత్ నామ సంవత్సర చైత్ర శుక్ల త్రయోదశి నుండి చైత్ర బహుళ పాడ్యమివరకు ఈమహోత్సవములు నిర్వహించడం జరుగుతుందన్నారు. మంగళవారంనాడు నిత్యారాధనం, అష్టోత్తర కలశాభిషేకం, తిరువీధి, విశ్వక్షేనారాధన, పుణ్యావచనం, అంకురారోపణం, తీర్ధ ప్రసాద గోష్ట జరుగుతోందని చెప్పారు.బుధవారం నిత్యారాధనం, అగ్నిప్రతిష్ఠ, పతాకప్రతిష్ఠ తీర్ధ ప్రసాద గోష్ట, సుదర్శన నారసింహ యాగం తీర్ధ ప్రసాద గోష్ట, నిత్య హోమములు ఉంటాయని తెలిపారు. గురువారం నిత్యారాధనం, నిత్య హోమములు, తీర్థ ప్రసాదగోష్ట,
శ్రీవేణుగోపాలస్వామి, శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు, తీర్ధ ప్రసాద గోష్ట ఉంటాయని చెప్పారు. చివరిరోజు శుక్రవారం నాడు నిత్యారాధనం, నిత్యహోమములు, చూర్ణోత్సవం, వసంతోత్సవం,
సువర్ణముఖీనదిలో చక్రస్నానోత్సవం, తీర్థ ప్రసాదగోష్ట, ద్వాదశారాధనలు, పూర్ణాహుతి, ధ్వజపతాక విసర్జన, పవలింపుసేవ తీర్థ ప్రసాద గోష్ట ఉంటుందని తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని, తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలని అర్చకులు కోరారు