విశాలాంధ్ర,సీతానగరం: డాక్టరు బి ఆర్ అంబేద్కర్ గురుకులాలలో 5వ తరగతి, ఇంటర్ మొదట సంవత్సరంలలో అడ్మిషన్లకు సంబందించి ప్రవేశ పరీక్షను నేడు (ఆదివారం) నిర్వహించడం జరుగుతుందని జోగమ్మపేట గురుకులం ప్రిన్సిపాల్ కె.ఈశ్వరరావు తెలిపారు.దీనికి సంబందించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ 5వతరగతి ప్రవేశపరీక్ష ఆదివారం ఉదయం 10గంటల నుండి 12.30గంటల వరకు, ఇంటర్ ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 4.30గంటల వరకు జరుగుతుందని తెలిపారు. స్థానిక పరీక్ష కేంద్రంలో 5వతరగతి ప్రవేశ పరీక్షకు 317మంది, ఇంటర్ ప్రవేశ పరీక్షకు 189మందిని జిల్లా అధికారులు కేటాయించారని తెలిపారు. జిల్లా కో ఆర్డినేటర్ చంద్రావతి అదేశాలు, సూచనలు మేరకు పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంటముందు పరీక్షా కేంద్రానికి రావాలని,హాల్ టిక్కెట్ తో పాటు బ్లూ,పెన్ను లేదా బ్లాక్ పెన్ను తీసుకొని హాజరు కావాలని కోరారు. హాల్ టిక్కెట్లో ఫోటో స్పష్టంగా కనిపించని యెడల పాస్ ఫోటో తీసుకొని రావాలని సూచించారు. ఈప్రవేశపరీక్షలో ర్యాంకులను బట్టి జిల్లాలోని గురుకులాల్లో సీట్లు కేటాయించడం జరుగుతోందని తెలిపారు. జిల్లాలో అన్ని గురుకులాల్లో నేడు జరగనున్న ప్రవేశ పరీక్ష నిర్వహణను జిల్లా కో ఆర్డినేటర్ తో పాటు సాంఘీక సంక్షేమ శాఖ ఉన్నతాదికారులు, గురుకుల సొసైటీ అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తారని తెలిపారు.