Monday, June 5, 2023
Monday, June 5, 2023

బీజేపీ జాతీయకార్యదర్శిపై జరిగిన దాడి అమానుషం: జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాసరావు

విశాలాంధ్ర,పార్వతీపురం: అమరావతిలో శుక్రవారం నాడు బిజెపి జాతీయ కార్యదర్శి పై వైసీపీ నాయకులు ప్రణాళిక బద్ధంగా జరిపిన దారుణ దాడిని ఖండిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంవద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీను ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజా స్వామ్యంలో ఇటువంటి దాడులు జరగడం అత్యంత హేయనీయమని, అధికార పక్షానికి చెందిన నేతలు దీని వెనుకఉండి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడి అమానుషమన్నారు. తక్షణమే దాడికి పాల్పడిన వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img