వారికి హారతులు ఇచ్చి స్వాగతం పలికిన గిరిజన మహిళలు
విశాలాంధ్ర,పార్వతీపురం: మన్యంజిల్లాలో గుమ్మలక్ష్మిపురం,కురుపాం, జియ్యమ్మ వలస మండలంలోని గిరిజన గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సెల్ టవర్స్ ను చూడటానికి జిల్లా కలక్టర్ నిశాంత్ కుమార్,జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడులు బుల్లెట్ వాహనాన్ని నడుపుతూ వెళ్ళడం అందరికీ ఆశ్చర్య పరిచింది. వారికి గిరిజన మహిళలు బోకేలు అందజేసి హారతి ఇచ్చి పువ్వులు జల్లి ఘన స్వాగతం పలికారు.పలు గిరిజన గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సెల్ టవర్స్ యొక్క పనితీరును మరియు వాటియొక్క సేవలగురించి స్థానిక గిరిజన ప్రజలతో సంభాషించారు. యు ఎస్ ఓ ఎఫ్, మరియు ఎల్
డబ్ల్యు ఎఫ్ ప్రోజెక్టుక్రింద కేంద్రప్రభుత్వం నూతనంగా గిరిజన ప్రాంతాల్లో 170సెల్
టవర్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వాటియొక్క నిర్మాణపనులు, పనితీరును ప్రజలతో మాట్లాడి నూతనంగా ఏర్పాటయిన సెల్ టవర్స్ యొక్క సేవలపై ఆరా తీశారు. కురుపాం నుండి బీరుపాడువరకు బస్సుసౌకర్యం కూడా ఏర్పాటుచేయడంజరిగిందని , ఈబస్సు వల్ల మారుమూల ప్రాంతాల గిరిజనులకు మెరుగైన సేవలుఅందుబాటులోకి వస్తాయన్నారు.గిరిజన గ్రామాలను సందర్శనచేసి వారితో మమేకమై తమ సమస్యలు తెలుసుకొని పరిష్కారం చూపినందుకు జిల్లా కలక్టర్, జిల్లా ఎస్పీ లకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారియొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారు. జిల్లాకు చెందిన ఇద్దరు బాస్ లు ఏజెన్సీ ప్రాంతంను ఆకస్మికంగా సందర్శించిన దృష్ట్యా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు జిల్లా ఆవిర్భావం జరిగి ఏడాది సంధర్భంగా ఈనెల 4న వినూత్నరీతిలో జిల్లాకేంద్రంలో శ్రమదానంచేసి అందరినీ ఆలోచింప జేసారు. మరో మూడురోజుల తరువాత మన్యంప్రాంతాలో బుల్లెట్ బండిపై తిరిగి అటు గిరిజనులలో, ఇటు జిల్లా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచే ప్రక్రియకు శ్రీకారం చుట్టారని చెప్పవచ్చును.