Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

మండల స్థాయి లో పరిష్కారం కాని అంశాలను జిల్లా స్థాయికి తేవాలి

బాల్య వివాహాలను ఆపాల్సిందే
సఖి జిల్లా స్థాయి సమావేశం లో జిల్లా కలెక్టర్ సూర్య కుమారి

విశాలాంధ్ర – విజయనగరం : మండల స్థాయి లో జరిగిన సఖీ సమావేశం లో పరిష్కరించలేని అంశాలను జిల్లా స్థాయి సమావేశం లో చర్చించాలని, కన్వర్జెన్స్ సమావేశం లో చర్చించి పరిష్కారాన్ని చూడవచ్చని కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియం లో జిల్లా స్థాయి సఖి సమావేశం కలెక్టర్ ఆధ్వర్యం లో జరిగింది. ఈ సమావేశం లో కలెక్టర్ మండల వారీగా జరుగుతున్న సమావేశాల పై సమీక్షించారు. ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఎలా పరిష్కారం జరుగుతున్నాయి అనే అంశాల పై ఆరా తీసారు. కొత్తగా వివాహం జరిగిన జంటలను గ్రూప్ లు గా చేయడం, వారితో సమావేశాలు నిర్వహించడం ఎలా జరుగుతోందనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశాలకు తప్పనిసరిగా సర్పంచ్ లు హాజరు కావాలని, అపుడు మాత్రమే ఆ గ్రామానికి చెందిన సమస్యలు వారికీ తెలియడమే కాకుండా వాటికి తగు పరిష్కారం కూడా లభిస్తుందని పేర్కొన్నారు. అందుకోసం జిల్లా పంచాయతి అధికారి సర్పంచ్ లందరికీ సర్కులర్ జరీ చేయాలనీ సూచించారు. . ఈవ్ టీజింగ్ , బాల్య వివాహాలు తక్షణమే ఆపాల్సిన అవసరం ఉందని, సర్పంచ్ లు ఇందులో భాగస్వామ్యం అయితేనే సాధ్యమవుతుందని అన్నారు. సఖీ సమావేశాలు ప్రభుత్వ పాఠశాలలలో, ప్రైవేటు పాఠశాలలతో పాటు హాస్టల్స్ కూడా నిర్వహించాలని తెలిపారు. ప్రతి 4వ శనివారం సాయంత్రం 4 నుండి 5 గంటల మధ్య పాఠశాలలలో 1 గంట సఖీ సమావేశాలకు తప్పనిసరిగా ప్రధానోపాధ్యాయులు కేటాయించాని, అందుకు ఒక సర్కులర్ జారీ చేయాలనీ డి.ఈ.ఓ కు ఆదేశించారు. ఈ సమావేశాల వలన డ్రాప్ ఔట్స్ తగ్గడమే కాకుండా బాలికల్లో ఆత్మ స్థైర్యం పెరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో కొన్ని చోట్ల యువత డ్రగ్స్, మద్యం సేవించి ఆకతాయిలుగా తిరుగుతున్నారని తన దృష్టికి వచ్చిందని, ఈ విషయం లో పోలీస్ శాఖ వారు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదే విధంగా నెహ్రు యువ కేంద్రం ద్వారా యువతకు తగు కౌన్సిలింగ్, అవగాహన జరపాలని కో ఆర్డినేటర్ విక్రం కు సూచించారు. . బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా తప్పక ఆపాల్సిందేనని అన్నారు. బాల్య వివాహాలు జరుగుతున్న సమాచారాన్ని స్వయంగా బాలికలే ముందుకు వచ్చి ఇచ్చేలా చైతన్యం కలిగించాలన్నారు. గృహాలలో ఉన్నత చదువు చదివి ఖాళీ గా ఉన్న మహిళలను గుర్తించి వారికీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్వయం ఉపాధి , ఉద్యోగ అవకాశాల కు తగు శిక్షణలు ఇవ్వాలని తెలిపారు. ముఖ్యంగా జీవన భ్రుతికి అవసరమగు శిక్షణలు అందిస్తే వారి ఆర్ధిక స్తోమతను పెంచవచ్చని అన్నారు. అందుకోసం స్కిల్ డెవలప్మెంట్ అధికారి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ కలసి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు.
ఈ సమావేశం లో ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంత కుమారి, డి.ఎం.హెచ్.ఓ డా. రమణ కుమారి, డి.ఆర్.డి.ఎ , మెప్మా పి.డి లు కళ్యాణ చక్రవర్తి, సుధాకర రావు, జిల్లా పంచాయతి అధికారి నిర్మల దేవి, సిపి.ఓ బాలాజీ, మండల ప్రత్యేకాదికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img