Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

మన్యం జిల్లా డిఈఓ మరోఆరుగురు ఉద్యోగుల అక్రమ సస్పెన్షన్ ను ఎత్తివేయాలి

సస్పెన్షన్ రద్దుచేసే వరకు దశలవారీ పోరాటాలుచేస్తాం
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేత
నేడు గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తాం

విశాలాంధ్ర,పార్వతీపురం: మన్యంజిల్లాలో రెండురోజుల పాటు పలుమండలాల్లో సుడిగాలి పర్యటన చేసిన రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మన్యంజిల్లా డిఇఓ డాక్టరు ఎస్ డివి రమణను, వీరఘట్టం, సీతమ్మపేట మండలాల విద్యాశాఖ అధికారులను, కెజిబివి ప్రిన్సిపాల్, మరో ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేయడం అక్రమం అని ఉపాధ్యాయ సంఘాలనాయకులు ద్వజమెత్తారు.శనివారంనాడు 11 ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నాయకులు, ఉపాధ్యాయసిబ్బంది కలిసి ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి (యు ఎస్ పి ఎస్) పేరిట సంఘంగా ఏర్పడి కార్యాచరణ ప్రకటించారు.నల్ల బ్యాడ్జీలు ధరించి శనివారం అంబేడ్కర్ విగ్రహానికి,ఆదివారం మహాత్మగాంధీ విగ్రహానికి వినతిపత్రాలు అందజేసి నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.సోమవారం సాయంత్రం 4గంటలకు మన్యం జిల్లాకేంద్రంలో బారీర్యాలీ నిర్వహణతోపాటు జిల్లా కలెక్టరుకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.మంగళవారం పార్వతీపురం, కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలతో పాటు డిప్యూటీ సిఎం, సాలూరుఎమ్మెల్యే రాజన్నదొరకు వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు.శనివారంనాడు జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో దాదాపు 200మంది ఉపాద్యాయులు పాల్గొని అక్రమ సస్పెన్షన్లు తక్షణమే రద్దుచేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఆర్డీఓ కార్యాలయ కూడలిలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించి న్యాయం చేయాలని కోరారు.జిల్లా విద్యాశాఖాదికారితోపాటు వీరఘట్టం ఎంఇఓ పి.కృష్ణమూర్తి, జిల్లా అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ రోజారమణి, కెజిబివిప్రిన్సిపాల్ రోహిణి,సీతమ్మపేట
ఎంఈఓ ఆనందరావు,మర్రిపాడు ఎంపీపీ పాఠశాల హెచ్ఎం రామినాయుడు, భామిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు రాంబాబుల సస్పెన్షన్  ఉత్తర్వులు రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని వారంతా తెలిపారు.ప్రభుత్వం పుస్తకాలు సరఫరా పూర్తి స్తాయిలో చేయక అధికారులపై సస్పెన్షన్ చేయడం ఎంతవరకు సమంజసమని వారంతా ప్రశ్నించారు. మంచిఅధికారిగా,విద్యార్థుల ఉపాధ్యాయుల, పాఠశాలల అభివృద్ధిని కోరే డిఈఓను సస్పెండ్ చేయడం అన్యాయమని వారంతా ముక్తకంఠంతో తెలిపారు. ఈనిరసన కార్యక్రమంలో పి ఆర్ టి యు, ఏపీటిఎఫ్, యుటిఎఫ్, ఎస్సీ ఎస్టీ సంఘం, వైఎస్సార్ టీచర్స్ యూనియన్ తదితర సంఘాలకు చెందిన నాయకులు అమరాపు సూర్యనారాయణ, వోలేటి తవిటినాయుడు, కాగాన విజయ్, నల్ల బాలకృష్ణ, బంకురు జోగినాయుడు, రావాడ అప్పలనాయుడు, సుర్ల మురళీ మోహన్, తోట రమేష్, సిహెచ్ శ్రీనివాసరావు, నీరస శ్రీనివాసరావు, సామల సింహాచలం, రాగాల శ్రీనివాస రావు, స్కూల్ అసిస్టెంటుల సంఘం నేత గోవిందరావు, పిఈటి సంఘంనేత గాంధీ తదితర సంఘాలనేతలు, వివిధ మండలాలబాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img