విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని 21గ్రామ సచివాలయంలలోని 35 గ్రామపంచాయతీలపరిధిలో 44 గ్రామాల్లో నిర్వహిస్తున్న ఁమా నమ్మకం నువ్వే జగన్ఁ – ఁజగనన్నే మాభవిష్యత్ఁ అన్న కార్యక్రమంకు అనూహ్య స్పందన లభిస్తోందని మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొంగు చిట్టిరాజు తెలిపారు. రెండు రోజులుగా అన్ని గ్రామాలలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కన్వీనర్లు, గృహసారదిలు పెద్ద ఎత్తున పాల్గొని ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటిస్తూ జగనన్న చేసిన అభివృధ్ధిని విస్క్రతంగా ప్రచారాన్ని చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర, జిల్లా పార్టీ ఆదేశాలతో పాటు ఎమ్మెల్యే ఆలజింగి జోగారావుగారి ఆదేశాల మేరకు అన్ని గ్రామాలలో ఉత్సాహంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన స్టిక్కర్లు మరియు కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జగనన్నే మా భవిష్యత్ అనేనినాదంతో ప్రజలతో మమేకం అవ్వడానికి ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈనెల 20వరకు జరిగే ఈకార్యక్రమంను విజయవంతం చేయడానికి చర్యలు తీసుకుంతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే జోగారావు, నియోజక వర్గ పరిశీలకులు శోభా హైమావతి ఆదేశాలు, సూచనలు మేరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.