Friday, September 22, 2023
Friday, September 22, 2023

ముగిసిన మొదటివిడత డిగ్రీ కళాశాల అధ్యాపకుల శిక్షణకార్యక్రమం

విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురంలోని శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీకళాశాలలో సోమవారం(జూన్ 5నుండి)నుండి ప్రారంభమైన మొదటి బ్యాచ్ శిక్షణ శనివారంతో ముగిసినట్టు నోడల్ కళాశాలయిన శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ ఆర్ సి ప్రిన్సిపాల్ డాక్టరు చింతల చలపతిరావు తెలిపారు.పార్వతీపురంమన్యంజిల్లా, విజయనగరంజిల్లాలోని ప్రభుత్వ డిగ్రీకళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు ఆంగ్లభాష పరిజ్ఞాననైపుణ్యతపై, ఇంగ్లీష్ స్కిల్స్ పెంపొందించేందుకు రాష్ట్రవిద్యాశాఖ కమిషనర్ పోల భాస్కర్ అదేశాలు మేరకు ఈప్రత్యేక శిక్షణ తరగతులను రాష్ట్ర స్థాయిలో 18నోడల్ కేంద్రాల్లో జరుగుతున్నాయని నోడల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతిరావు తెలిపారు.రాష్ట్రకళాశాల విద్యా కమిషనర్ డాక్టర్ పోల భాస్కర్  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులందరికీ ఆంగ్లంలో బోధనా నైపణ్యతపెంచేందుకు, ఇంగ్లీష్ స్కిల్స్ అధ్యాపకులలోపెంచేందుకు, వారికి ఆంగ్లంలో ప్రావీణ్యతను పెంచడానికి  ఈశిక్షణతరగతులను ఏర్పాటుచేశారని తెలిపారు.ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతం సబ్జెక్టులకు తప్పించి మిగిలిన సబ్జెక్టులను బోధించే అధ్యాపకులంతా తప్పనిసరిగా శిక్షణతరగతులకు హాజరు కావాలని తెలిపారు. మొదటివిడతగా రెండు జిల్లాలోని తొమ్మిది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన (పార్వతీపురం, గుమ్మలక్ష్మిపురం, వీరఘట్టం,పాలకొండ, సాలూరు,
సీతంపేట, గజపతినగరం,రాజాం, చీపురు పల్లి, విజయనగరంలోని) అధ్యాపకులు
49మందిఅధ్యాపకులు శిక్షణ పొందారని చెప్పారు. మిగిలినఅధ్యాపకులకు రెండో విడతగా సోమవారంనుండి (జూన్ 12నుండి జూన్ 17వరకు) ఏడురోజులు పాటు నిర్వహిస్తామని చెప్పారు. ఈశిక్షణ తరగతులకు కోర్సు
కో-ఆర్డినేటరుగా కళాశాల ఆంగ్ల ఉపన్యాసకురాలు బి. శాంతకుమారి వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఆన్లైన్ లోను, ఆఫ్ లైన్ లోను శిక్షణతరగతులు ప్రతీరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించడం జరిగిందన్నారు. దీనికోసం జిల్లాలోని వివిధ కళాశాలకు చెందిన నలుగురు అధ్యాపకులను రిసోర్సు పర్సనులుగా కూడా విద్యాశాఖ కమిషనర్ నియమించినట్లు తెలిపారు. మొదటివిడత శిక్షణ తరగతులు విజయవంతంగా నిర్వహించామన్నారు. కమిషనర్ పోల భాస్కర్ అదేశాలు మేరకు 18నోడల్ రిసోర్స్ కేంద్రాల్లోనిర్వహిస్తున్న ఈశిక్షణ తరగతులు ఎంతో ఉపయోగకరమని పలువురు అధ్యాపకులు, కో- ఆర్డినేటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇటువంటి శిక్షణ తరగతులు వల్ల బోధనలో స్కిల్స్ తెలియడమే గాక ఎన్నో సందేహాలు నివృత్తి అయ్యేందుకు ఉపయోగ పడుతుందన్నారు. వారంతా కమిషనర్ పోల భాస్కర్ కు అభినందనలు తెలిపారు. అవకాశముంటే విధ్యార్థులకు కూడా ఇటువంటి శిక్షణ తరగతులు నిర్వహించాలని పలువురు తెలిపారు. నిర్వహిస్తున్నారని, ముగింపు రోజున వారంతా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ పోల భాస్కర్ ఏర్పాటుచేసిన ఇటువంటి శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఇంగ్లీష్ బోధనలో స్కిల్స్ పెంపొందించేందుకు శిక్షణతరగతులు ఏర్పాటుతోఎన్నో నిఅంశాలు సులభంగా అర్ధం అయ్యేలా చెప్పారని తెలిపారు.ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు 18 నోడల్ రిసోర్స్ కేంద్రాల అధ్యాపకులు కమిషనర్ కు అభినందనలు తెలిపారు.అధ్యాపకులతోపాటు అవకాశం ఉంటే విధ్యార్థులకుకూడా ఇటువంటి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని పలువురు అధ్యాపకులు సూచించారు. రెండు జిల్లాలోని అధ్యాపకులకు శిక్షణ తరగతులు ఏర్పాటుచేసిన నోడల్ కళాశాల అయిన శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీకళాశాలకేంద్రంలో శిక్షణకు సరిపడే మౌలిక సదుపాయాలు కల్పనపట్ల అధ్యాపకులు పూర్తి సంతృప్తి వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img