Friday, June 2, 2023
Friday, June 2, 2023

మూడు సహకార సంఘాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని అంటిపేట, తామరఖండి, ఆర్.వెంకమ్మపేట గ్రామాలప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలకు ముగ్గురు నూతన అధ్యక్షులను నియమిస్తూ సహకార సంఘం ఉన్నతాధికారులు ఉత్తర్వుల జారీ చేశారు. అంటిపేట సహకార సంఘం అధ్యక్షుడుగా గాదెలవలసకు చెందిన బొన్నాడ సత్యనారాయణను, తామరఖండి అధ్యక్షుడుగా అదే గ్రామానికి చెందిన మూడడ్ల మన్మధరావు, ఆర్ వెంకమ్మపేట అధ్యక్షుడుగా అదే గ్రామానికి చెందిన రెడ్డి సూర్యనారాయణను నియామకం చేస్తూ సహకార సంఘం ఉన్నతాధికారులు ఉత్తర్వుల జారీచేశారు. కొత్తగా నియమించబడిన ముగ్గురు అధ్యక్షులు ఎమ్మెల్యే జోగారావును శనివారం కలసి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా నియమించబడిన ముగ్గురు అధ్యక్షులకు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామాలకు చెందిన రైతులు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img