Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

మ్యుటేషన్ల జారీలో జాప్యంతగదు: జాయింట్ కలెక్టర్ ఆనంద్

విశాలాంధ్ర,పార్వతీపురం : మ్యుటేషన్ల జారీవిషయంలో జాప్యం తగదని, భూముల రీసర్వేను పక్కాగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆనంద్ తెలిపారు రీసర్వేకు సంబంధించి ప్రతి మండలానికి, గ్రామానికి ప్రత్యేకంగా నియమించిన సర్వేయర్లు, రెవిన్యూ అధికారులతో శనివారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తయారు చేసిన సర్వేరికార్డులే రానున్న తరాలకు ప్రామాణికమని తెలిపారు. పక్కాగా సర్వే నిర్వహించి సాగుదారు రైతులకు తప్పులు లేని భూ హక్కు పత్రాలను అందించాలని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో భూమిపై సాగులో ఉన్నవారి వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. మ్యుటేషన్స్, భూ పంపకాలు మొదలైనవి పూర్తిచేస్తే పని సులభతరమవుతుందని తెలిపారు. మ్యుటేషన్స్ విషయంలో వేగవంతం ఉండాలని చెప్పారు. భూ రికార్డుల తయారీ, మ్యుటేషన్స్ విషయంలో గ్రామ రెవిన్యూ అధికారులు అలసత్వం వహిస్తే వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడమన్నారు. మ్యుటేషన్ల జారీలో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడం జరిగిందని, అయినప్పటికీ కొన్ని మండలంలో మ్యుటేషన్ల జారీలో జాప్యం జరుగుతోందని అన్నారు. ఇకపై ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు.ఈసమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారి కె. హేమలత, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మండల, విలేజ్ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img