విశాలాంధ్ర,సీతానగరం: జిల్లా కలక్టర్ అదేశాలు మేరకు రెవెన్యూ డివిజన్ పరిధిలోని సీతానగరం, గరుగుబిల్లి మండలాల్లో వై. ఎస్. ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంలో భాగముగా రీసర్వే మొదటి విడతలో రీసర్వే పూర్తయిన గ్రామాలలో సర్వేరాళ్ళు ఏర్పాటును మంగళవారం పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత పరిశీలించారు.గరుగుబిల్లి మండలంలోని సీతారాంపురం (సివ్వాం దరి)గ్రామంలో జరుగుతున్న సర్వే రాళ్ల ఏర్పాటును పర్యవేక్షించామన్నారు. రైతులందరూ సర్వే రాళ్ల ఏర్పాటుకు ఫీల్డ్ సిబ్బందికి సహకరించాల్సిందిగా కోరారు. మండలంలోని చిన్నారాయుడుపేట, పాపమ్మవలస, నీలకంఠపురం గ్రామాలను సందర్శించారు. ఫీల్డ్ సిబ్బందికి ఉన్న సమస్యలపై ఆరాతీసి ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తెలియజేయమని, వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలియజేశారు. రోవర్ల పనితీరును పరిశీలించారు. రీ సర్వే పనులు, సర్వేరాళ్ల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని తహశీల్దారు, సర్వేసిబ్బందిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాలు తూచ తప్పకుండా పాటించాలని కోరారు.ఈకార్యక్రమంలో తహశీల్దార్ ఎన్వీ రమణ, రీ సర్వే డి టి పప్పల చిట్టెమ్మ మండల సర్వేయరు , ఆర్ ఐ కరుణాకర్, ఫీల్డ్ సిబ్బంది, పాల్గొన్నారు.