విశాలాంధ్ర, పార్వతీపురం: స్పందన కార్యక్రమంద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశించారు.సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్పందన కార్యక్రమంకు వచ్చిన ప్రజలసమస్యలవినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామనిహామీ ఇచ్చారు. ఏడు వినతులు వచ్చాయని తెలిపారు. ఈస్పందన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ డా.దిలీప్ కిరణ్, ఎస్బి, సిఐ,శ్రీనివాసరావు , డిసిఆర్బి, సిఐ. ప్రభాకర్, ఎస్ఈబి సిఐ శ్రీధర్ , పార్వతీపురం రూరల్ సిఐ విజయానంద్, డిసిఆర్బి, ఎస్ఐ దినకర్ తదితరులు పాల్గొన్నారు.