విశాలాంధ్ర,పార్వతీపురం: మణ్యం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అదనపు ఎస్పీ దిలీప్ కిరణ్ లు స్పందన కార్యక్రమంను నిర్వహించారు. ప్రతీ పిటీషనరుతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీలు సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బందికి తెలియజేశారు.నిర్దిష్ట గడువులోపు ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు వారి సమస్యలు స్వేచ్ఛగా విన్నవించుకోవచ్చుని,వాటిపై చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కారం చేస్తామని చెప్పారు.సోమవారం 14మంది నుండి స్పందనా పిర్యాదులు స్వీకరించామని చెప్పారు.ఈకార్యక్రమంలో దిశా డిఎస్పీ ఎస్.ఆర్ .హర్షిత , ఎ ఆర్ డిఎస్పీ , బి. నాగేశ్వరరావు ,ఎస్బి ఇన్స్పెక్టర్ ఎన్ . శ్రీనివాసరావు , డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ ఎన్ వి. ప్రభాకర్, డి.సి.ఆర్.బి, ఎస్ ఐ. పి. దినకర్, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.