Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఇప్పలపోలమ్మ పండుగకు అన్ని ఏర్పాట్లతో పాటు దర్శనాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి:

పార్వతీపురం ఆర్డీఓ హేమలత
విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఈనెల 28నుండి 30వరకు జరిగే శ్రీశ్రీశ్రీ ఇప్పల పోలమ్మ అమ్మవారి పండుగ సంధర్బంగా దర్శనాలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కె.హేమలత తెలిపారు.గురువారం తన కార్యాలయంలో శ్రీశ్రీశ్రీ ఇప్పల పోలమ్మ గ్రామ దేవత పండుగ సంధర్బంగా ఊరేగింపు, దర్శనాలకు చేయవలసిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో రెవిన్యూ డివిజినల్ అదికారి కె.హేమలత మాట్లాడుతూ ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే గ్రామదేవత పండుగ కోవిడ్ మూలంగా ఆరు సంవత్సరాల తరువాత నేడు జరుపుతున్నారని, చాలా సంవత్సరాల తరువాత పండుగ జరుగుతున్నందున ప్రజలు అధిక సంఖ్యలో హజరవుతారని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని శాఖలు కలిసి సమన్వయంతో పనిచేసి పండుగను విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. పండుగలో శాఖల వారీగా చేపట్టవలసిన పనులను కేటాయించారు.మంచినీరు సరఫరా, శానిటేషను పనులు పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖలు కలిసి ఏర్పాట్లు చేయాలన్నారు.పండుగ మూడురోజులు మంచినీటి సరఫరా అంతరాయం లేకుండా చూడాలని, శివారు ప్రాంతాలకు ట్యాంకర్లు ద్వారా నీరు పంపిణీ చేయాలన్నారు. పంపుహౌస్ వద్ద కరెంటుయిబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. శానిటేషనుకు అవసరమైన అదనపు సిబ్బందిని తీసుకురావాలని తెలిపారు. బందోబస్తుకు సంబంధించి అదనపు సిబ్బందిని నియమించాలని, ఉరేగింపు రూటు, సాధారణ ప్రజల ఆలయ దర్శనాలు, ముఖ్యుల దర్శనాలలోయిబ్బందులు లేకుండా పోలీసు అదికారులు పర్యవేక్షించాలని, అందుకు అవసరమైన రూటుమ్యాపు వివరాలు పోలీసులకు అందించాలని పండుగ నిర్వాహకులకు సూచించారు. విద్యుత్ అదికారులు పండుగ మూడురోజులు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని,ముందుగానే ఉన్నతాధికారులతో మాట్లాడి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. స్థానిక తహశీల్దారు మిగిలిన శాఖలతో సమన్వయం చేసుకోవాలని, ముఖ్యుల దర్శనాలకు ఏర్పాట్లు చూసుకోవాలని తెలిపారు. రోడ్లుభవనాల శాఖ రధాలు తిరిగే రూటులలోరోడ్డురిపేర్లు చేయాలన్నారు. పార్కింగు,రవాణా సదుపాయాలు, వెద్యశిభిరాలు ఏర్పాట్లు తదితర ఏర్పాట్లు ఆయాశాఖలు చూసుకోవాలని తెలిపారు. ప్రతీశాఖ వారు చేస్తున్న ఏర్పాట్ల వివరాలతో 27న నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని తెలిపారు. సమావేశంలో సర్కిల్ ఇనస్పెక్టరు కృష్ణారావు, మున్సిపల్ కమీషనరు జె.రామఅప్పలనాయుడు, జిల్లా ఎండోమెంటు అదికారి డి.వి.వి.ప్రసాదరావు, ఉత్నవ కమిటీ సభ్యులు, విద్యుత్,రోడ్లుభవనాలు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img