Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఉపాధ్యాయ సస్పెన్షన్లుపై సీఎం స్పందనపై ఎన్ జి ఓ అసోసియేషన్ అధ్యక్షుడు కిషోర్ హర్షం

విశాలాంధ్ర,పార్వతీపురం: మన్యంజిల్లా విద్యాశాఖాధికారి డాక్టరు ఎన్ డి వి రమణ మరో ఆరుగురు ఉద్యోగుల సస్పెన్సన్ల వ్యవహారంపై రాష్ట్రముఖ్యమంత్రి నేరుగా సోమవారం స్పందించి తక్షణమే మన్యం జిల్లా కలెక్టరు నిషాంత్ కుమార్ ను ఉద్యోగ, ఎన్జిఓ సంఘాలనేతలను పిలిచి సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారం చేయాలని కోరడం హర్షనీయమని పార్వతీపురం మన్యం జిల్లా ఎన్జీఓ సంఘం అధ్యక్షులు జి వి ఎస్ కిషోర్ తెలిపారు. మంగళవారం ఆయన జేఏసి తరుపున జిల్లా కలెక్టరు కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈసందర్భంగావిలేకరులతో మాట్లాడుతూ ముందుగా సమస్యపై స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు, జిల్లా కలెక్టరు తదితర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.విద్యాశాఖలో జిల్లా విద్యా శాఖాధికారి డాక్టరు రమణ, తదితర ఉద్యోగుల సస్పెన్షన్ పై సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీకీ ఉపాధ్యాయసిబ్బంది పెద్దఎత్తున తరలిరావడంతో పాటు ఎన్ జి ఓ యూనియన్ మద్దతు పలకడాన్ని గమనించిన ప్రభుత్వం జిల్లా కలెక్టరును చర్చలుజరిపి న్యాయబద్ధంగా పరిష్కారం చేయాలని కొద్ది సమయంలోనే ఆదేశించడం శుభపరిణామమన్నారు. మణ్యంజిల్లాఏర్పడి ఏడాదికాలంలో జిల్లాలో ప్రశాంత వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, దీనిపై జిల్లా కలెక్టరు, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకొని సత్వరమే డిఈఓ, ఇతర ఉద్యోగులపై విధించిన సస్పెన్షన్ ఉత్తర్వులు ఎత్తివేసి న్యాయం చేయాలని ఆయనసూచించానని చెప్పారు. జిల్లా కలెక్టరు అన్ని సంఘాల నాయకులతో సహృద్భావ వాతావరణంలోమాట్లాడిన తీరును చూసి తదుపరి కార్యాచరణను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మన్యం జిల్లాలో కష్టపడి పనిచేసే ఉద్యోగులు ఉన్నారని, జిల్లాలో ఒక మంచి అధికారికి అన్యాయం జరిగిందని తెలిసి ఐక్యతగా ఉపాధ్యాయ పోరాట సంఘాల సమితి పేరిట ఉద్యమాన్ని నాలుగు రోజుల పాటు నిర్వహించడం, దానికి ఏపీ ఎన్జీవో యూనియన్ తరుపున మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు. ఉద్యోగుల సమస్య పరిష్కారం కోసం నిరంతరం ఏపీ ఎన్జీవో ఉద్యోగుల సంఘం పనిచేస్తుందని తెలిపారు.శాంతియుత విధానాల తరహాలోనే మన్యం జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఏపీ ఎన్జీవో యూనియన్ మద్దతు కోరడం తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img