Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏప్రిల్ 3నుంచి 18 వరకు 10వతరగతి పరీక్షలు

పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలి:
జాయింట్ కలెక్టర్

విశాలాంధ్ర-పార్వతీపురం: వచ్చేనెల 3 నుండి 18 వరకు జరగనున్న పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేవిధంగా పూర్తి స్థాయిలోఏర్పాట్లు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పదోతరగతి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాఆవిర్భావం తరువాత తొలిసారిగా ఈఏడాది 64 పరీక్షా కేంద్రాలను ఈ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.10వేల 784 మంది విద్యార్థిని, విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా వీరిలో రెగ్యులర్ విద్యార్థులు – 5272 మంది,విద్యార్థినులు 5442 మంది రాస్తున్నారని చెప్పారు.ప్రైవేట్ విద్యార్థులు 70 మంది ఉన్నారని చెప్పారు.ఈపరీక్షల సమయంలో మాస్ కాపీ జరగకుండా పర్యవేక్షణకు మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్లను నియమిస్తున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు సబందించి సమాచారం అందించేందుకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలని డిఆర్ఓ వెంకటరావును ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న తాత్కాలిక స్ట్రాంగ్ రూంనుంచి ఆయాకేంద్రాలకు ప్రశ్నా పత్రాలను తరలించేందుకు గట్టిభద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షలు ముగిసినతరువాత జవాబు పత్రాలను ఏరోజుకి ఆరోజు పోస్టు ఆఫీసు లో డిపాజిట్ చేయాలని పోస్టల్ సహాయ సూపరిండెంట్ జి.వి.రమణను ఆదేశించారు. ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేర్చేందుకు రవాణాసౌకర్యం కల్పించాలని రవానశాఖ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి.సత్యనారాయణను కోరారు. విద్యార్థిని, విద్యార్థులు సకాలంలో పరీక్షాకేంద్రాలకు చేరుకొనే విధంగా బస్ సర్వీసులను నడపాలని ప్రజారవాణాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలన్నారు. వేసవిదృష్ట్యా పరీక్ష కేంద్రాలవద్ద వైద్యశిబిరాలను పి హెచ్ సి పరిధిలోని వైధ్యాధికారులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రశాంతవాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని కోరారు.ఈకార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి డా, ఎస్.డి.వి.రమణ, డిఎస్ పి ఏ.సుభాష్, పార్వతీపురం, పాలకొండ ఉపవిద్యాశాఖాధికారులు బ్రహ్మాజీ, విజయకుమారి, పోస్టల్ సహయ సూపరిండెండెంట్ జి.వి.రమణ, ఆర్టీసి
డిపిటిఓ టి.వి.ఎస్. సుధాకర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి.సత్యనారాయణ, ఎమ్ పి హెచ్ ఓ ఎల్.సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img