Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కథా రచయిత గౌరునాయుడు మాష్టారుకు అభినందలు

విశాలాంధ్ర- పార్వతీపురం : ప్రముఖ కధారచయిత, కవి, నిత్యసాహిత్య కృషీవలుడు గంటేడ గౌరునాయుడు మాస్టారుకు ప్రముఖపాత్రికేయులు, కవి, రచయితగా పేర్గాంచిన ఁపతంజలి సాహిత్య పురస్కారాన్నిఁ నేడు విజయ నగరంలో అందుకున్న సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ మాజీ చైర్మన్ అదపాక సత్యా రావు అభినందనలు తెలిపారు.బుదవారం ఆయన ఒకప్రకటనను జారీ చేశారు. స్వర్గీయ పతంజలి పేరిట ఁపతంజలి సాహిత్య పురస్కారాన్నిఁ బుధవారం విజయనగరంలో అందుకోవడం సంతోషదాయకం అన్నారు. గౌరునాయుడుమాష్టారు రైతులు, రైతు కూలీలు, గ్రామీణ ప్రాంత సకల వృత్తుల వారి కష్ట నష్టాలు, దయనీయ స్థితిగతులు తన రచనల ద్వారా సమాజం దృష్టికి నిరంతరం తీసుకవస్తూ, సాహిత్య వ్యవసాయాన్ని పండిస్తున్నారని సత్యా రావు ఒక ప్రకటన లో ప్రశంసించారు. గౌరునాయుడు మరిన్నిపురస్కారాలు, సత్కారాలు పొందాలని ఆయన తన ప్రకటనలో ఆకాంక్షించారు. ఇదిలాఉండగా గంటేడ పతంజలి పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా స్నేహకళా సాహితీ , శ్రీకాకుళ సాహితీ, సాహితీ లహరి తదితర కళాసాహిత్య సంస్థలకు చెందిన ఎంతోమంది సాహితీ వేత్తలు,అభిమానులు గంటేడకు అభినందనలు తెలిపారు. గౌరునాయుడు 1998లో చా.సో స్ఫూర్తి పురస్కారం, జ్యేష్ట లిటరరీ అవార్డు, ఎస్ బి ఎస్ ఆర్ కళా పీఠం సాహిత్య పురస్కారం, తెలుగు విశ్వ విద్యాలయం ,2000లో విశాల సాహితీ పురస్కారం,2006లో పల్లి తిరుపతిరావు స్మారక కవిత పురస్కారం,2007లో అధికార భాషా సంఘం తెలుగు వికాస పురస్కారం, ఉమ్మిడిశెట్టి సాహిత్య పురస్కారం, 2008లో అర్. ఎస్ కృష్ణ మూర్తి సాహిత్య పురస్కారం,2009లో మాడభాషి రంగాచారి స్మారక సాహిత్య పురస్కారం,2010లో తెలుగు విశ్వ విద్యాలయం ఉత్తమ కథా పురస్కారం, తెలుగు భాషా దినోత్సవం గిడుగు పురస్కారం,2011లో రాచకొండ రచనా పురస్కారం,పోలవరపు కోటేశ్వర రావు స్మారక సాహిత్య పురస్కారం,2012లో గురజాడ సాహిత్య పురస్కారం,2014లో పురిపండా అప్పల స్వామి స్మారక సాహిత్య పురస్కారం,2016లో అవంత్స సోమ సుందర్ కవిత పురస్కారం, నూతల పాటి గంగాధరం సాహితీ పురస్కారం 2017లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం 2018లో అక్షర గోదావరి సాహితీ పురస్కారం, వేగావతి భారతి సాహితీ పురస్కారం, డా. పరుచూరి రాజారాం సాహితీ పురస్కారం, ఎం ఆర్ ఆర్ చారిటబుల్ ట్రస్టు సాహితీ రత్న పురస్కారం, తాడ్డేస్ ఎలైట్ మెంటు అవార్డు, తెనాలి పురపాలక సంఘం ఉగాది పురస్కారం, తాపీ ధర్మారావు జీవిత సాఫల్య పురస్కారం, ఒంగోలు
కళామిత్ర ప్రతిభ పురస్కారం ఇలా ఎన్నో పురస్కారాలు గౌరునాయుడు పొందారు. ఉత్తరాంధ్రలో మరెన్నో పురస్కారాలు,ప్రశంసలు, సన్మానాలని ఆయన అందుకోవడం విశేషం.ఆయన రాసిన రచనలు 1997 నుండి పుస్తకాలు రూపంలో వచ్చాయి. ఏటిపాట కథలు, పాడుదుమా స్వేచ్ఛాగీతం పాటలు, కలింగోర, నాగేటిచాలుకు నమస్కారం దీర్ఘ కవిత, గీతాంజలి పాటలు, ప్రియ భారతి జననీ దేశ భక్తి గీతాలు, నదిని దానం చేసాక కవిత్వం, నాగలి దీర్ఘకవిత, ఒక రాత్రి- రెండుస్వప్నాలు కథలు, గీత గేయానుసరణ, ఎగిరిపోతున్న పిట్టల కోసం కవిత్వం, మనసు పలికే గజల్లు, అలల సవ్వడి పద్యాలు, ఉన్నమాట పద్యాలు, మట్టి గోస దీర్ఘ కవిత, పార్వతీపురం కథలు, గంటేడ గౌరు నాయుడు సాహిత్యం ఇలా ఎన్నెన్నో పుస్తకాలని స్నేహా కళా సాహితీ ఆద్వర్యంలో ప్రచురించారు.ఉత్తరాంధ్రలో కథారచయిత,కవి,కవిత్వం, పాట,పద్యం ఆన్ని ప్రక్రియలను సమర్థ వంతంగా నిర్వహిస్తున్న గంటేడ గౌరునాయుడు మన పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి చెంది మన్యం జిల్లాలోని ఎంతో మందిని సాహితీ వేత్తలుగా తయారు చేస్తూ ముందుకు సాగుతున్నారు. గౌరు నాయుడు మరెన్నో కథలు,కవితలు, పాటలు,పద్యాలు రాసి ఉత్తరాంధ్ర సాహిత్యంను అభివృధ్ధి చేయాలనీ అంతా కోరుతున్నారు. ఆయన జీవిస్తున్న నేపథ్యం, ఉత్తరాంధ్ర జిల్లాల రైతుల జీవన విధానం, కూలీలజీవితాలు, పొట్టకూటి కోసంవలసలు వెళ్తున్న ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు , భూములు కోల్పోయిన రైతుల అవేదనే తనకధా, కవిత వస్తువులు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img