Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కుటుంబ వైద్య విధానంతో సత్ఫలితాలు

జిల్లా కలక్టర్‌ నిషాంత్‌ కుమార్‌
విశాలాంధ్రIపార్వతీపురం/పాలకొండ : కుటుంబ వైద్య విధానంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటివద్దకే వైద్యం అందించి ప్రజారోగ్యం మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు.గురువారం పాలకొండ డివిజన్‌ పరిధిలో వీరఘట్టం మండలం చలివేంద్రిగ్రామంలో నిర్వహించిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ శిబిరాన్ని ఆయన సందర్శించారు.ఎంత మందికి వైద్యంఅందిస్తున్నారు, ఏఏ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నదీ, ఎంతమేరకు మందులు నిల్వఉన్నవి అనే విషయాలను వైద్యులను అడిగితెలుసుకున్నారు. గ్రామంలో ఇప్పటివరకు ఎ.ఎన్‌.ఎమ్‌ లు నిర్వహించిన సి.డి, ఎన్సిడీ సర్వే వివరాలను పరిశీలించారు. ఫ్యామిలీ ఫిజీషియన్‌ శిబిరంవద్ద రోగులకు అందుతున్న వైద్యసేవలపై అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు మెరుగైన వైద్యం కోసం వ్యయ ప్రయాసలకు గురికాకుండా ఇంటి వద్దకే వైద్యం చేరువ చేయాలన్న మంచి దృక్పథంతో ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజీషియన్‌ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రజలు వైద్య పరీక్షలకు ముందుకురావాలని, తద్వారా దీర్ఘకాలిక వ్యాధులు, సోకిన జబ్బులను గుర్తించి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించవచ్చన్నారు. ప్రజలు ఆరోగ్యంపట్ల శ్రద్ధవహించాలని సూచించారు. ఆరోగ్యకర గ్రామాలుగా రూపొందించేందుకు అందరిపైనా బాధ్యతఉందనిగుర్తుచేశారు.
అంగన్వాడీ కేంద్రం పరిశీలించిన కలెక్టర్‌:
వీరఘట్టంమండలంలోని నడిమికెళ్ళ గ్రామ అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలోని ఎంతమంది చిన్నారులు,గర్భిణీలు, బాలింతలకు పౌష్టికహారం అందిస్తున్నది అడిగితెలుసుకున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న అభూరి రామలక్ష్మికి పౌష్ఠికాహారం అందివ్వడం రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయి పెరిగిందని తెలపడంతో అంగన్వాడీ కేంద్రం నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు రక్తహీనత వలన కలిగే ఇబ్బందులను విస్తృతంగా అవహన కల్పించాలని అన్నారు. కేంద్రంలోని సరుకుల నిల్వతోపాటు వండిన వంటకాలను, నాణ్యతను స్వయంగా పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని పరిశీలించారు. సచివాలయం పరిధిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు.
ధాన్యం కొనుగోలుకు చర్యలుతీసుకుంటా:
రైతుల కల్లాల్లో ధాన్యంబస్తాలు పెద్ద ఎత్తునఉన్నాయని, వాటిని కొనుగోలుచేసి న్యాయంచేయాలని చలివేంద్రిలో రైతులు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకొని వెళ్లారు. ఆయనవాహనాన్ని రైతులు నిలిపి వారి ఆవేదనను ఆయనదృష్టికి తీసుకొని వెళ్ళారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిచర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ తెలిపారు.ఎక్కువ ధాన్యంబస్తాలు ఇంకాకల్లాల్లోనే ఉన్నాయని చెప్పారు.జిల్లాలో లక్ష్యాల మేరకు ధాన్యం కోనుగోలు చేయడంతో పాటు అదనంగా 30వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యంకొనుగోలుకు ప్రభుత్వము అనుమతిమంజూరు చేసిందని రైతులకు వివరించి సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పారు. ఆయన వెంట జిల్లావైద్యఆరోగ్య శాఖాధికారి జగన్నాధ రావు, డిప్యూటీ డి ఎమ్‌ అండ్‌ హెచ్‌ పార్వతి, ప్రోగ్రాం అధికారి డా.ఎమ్‌.వినోద్‌, ఇన్‌ ఛార్జ్‌ జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె.విజయగౌరీ, తహాసిల్దార్‌ సిహెచ్‌.సత్యనారాయణ, పౌరసరఫరాల డిటి.మల్లేశ్వరరావు, వైద్యసిబ్బంది, గ్రామ సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img