Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఘనంగా నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు

విశాలాంధ్ర,సీతానగరం: తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు గురువారం మండలంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా స్థానిక హనుమాన్ కూడలివద్ద ఉన్న షిర్డీసాయి దేవాలయంకు టీడీపి నాయకులు చేరుకొని పూజలు నిర్వహించి, కొబ్బరికాయలనుకొట్టి చంద్రబాబు నాయుడుకు ఆరోగ్యం ఇవ్వాలని, రానున్న సాధారణ ఎన్నికలలో ముఖ్యమంత్రి కావాలని కోరుతూ పూజలు నిర్వహించారు.అనంతరం స్థానిక కొమ్మినేని ఇంటివద్ద కేకునికోసి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును రానున్న సాధారణ ఎన్నికలలో ముఖ్యమంత్రి చేసేందుకు అంతా కలిసికట్టుగా పనిచేద్దామని నాయకులంతా ముక్తకంఠంతో తెలిపారు. ఆయన పార్టీకీ,రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు.ఈకార్యక్రమంలోదామినేని భానుప్రసాద్, సాల హరిగోపాల్, రౌతు వేణుగోపాలనాయుడు, బుడితిశ్రీనివాసరావు, పెద భోగిలి,రామవరం, తామరఖండి, చెల్లం నాయుడువలస సర్పంచులు జొన్నాడ తేరేజమ్మ పెంట సత్యంనాయుడు, మూడడ్ల వెంకటనాయుడు, వాకాడ పారినాయుడు, నాయకులు సబ్బాన శ్రీనివాసరావు, భాస్కరరావు, రెడ్డి సింహాచలంనాయుడు, శంకరరావుమాస్టారు,శివున్నాయుడు, వెంకటనాయుడు, శంకరరావు , గరికయ్య, యోగీశ్వరరావు, సాయి,లక్ష్మణ, తేలు తిరుపతి, పెంటసురేష్, సతీష్, వంజరాపు గుంపస్వామి, చింతాడసత్యనారాయణ, పైడిపునాయుడు, టాంకాల శ్రీనివాసరావు,రామకృష్ణ, యాళ్ళ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img