Friday, April 19, 2024
Friday, April 19, 2024

జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్

విశాలాంధ్ర, పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ బుదవారం భాధ్యతలు స్వీకరించారు.ఇంతవరకు జిల్లా ఎస్పీగా పనిచేసిన విద్యాసాగర్ నాయుడుకు విశాఖపట్టణం డిసిపిగా బదిలీ జరగగా ఆయన ఇక్కడ నుండి మంగళవారం రిలీవ్ అయిన సంగతి తెలిసిందే. కొత్త ఎస్పీగా భాధ్యతలు చేపట్టిన విక్రాంత్ పాటిల్ కు జిల్లా అదనపు ఎస్పీ దిలీప్ కిరణ్,పార్వతీపురం , పాలకొండ
డి.ఎస్పీలు ఏ సుభాష్,కృష్ణారావు,దిశ డి.ఎస్పి ఎస్ అర్ హర్షిత, ఏఆర్ డిఎస్పీ నాగేశ్వరరావు, ఎస్బి సీఐ శ్రీనివాసరావు,ఎస్సీ,ఎస్టీ డిఎస్పీ శ్రీనివాసరావు తదితర డి ఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, స్పెషల్ బ్రాంచ్, నిఇంటిలిజెన్స్, ఎస్ఈబి తదితర అధికారులు, జిల్లా పోలీస్ కార్యాలయంలోని వివిధ శాఖల సిబ్బంది ఆయనకు పుష్ప గుచ్చెంలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్బంగా ఆయనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ తనను మన్యంజిల్లా ఎస్పీగా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర డిజిపికు కృతజ్ఞతలు తెలిపారు. మన్యంజిల్లాలో గతంలో ఓఎస్డిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. అందరి సహకారంతో మన్యం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు.మన్యంజిల్లా ఏర్పడి సంవత్సరం తరువాత ఎస్పీగా భాధ్యతలు చేపట్టిన తాను మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని చెప్పారు.సమస్యలు ఉంటే తన దృష్టికి ఫోన్ ద్వారా చెప్పిన పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం జిల్లాలోని పోలిస్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో అన్ని పోలిస్ స్టేషన్ల పరిదిలో క్రైం, తదితరఅంశాలను తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img