Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకు బదిలీ – కొత్త ఎస్పీగా విక్రాంత్ పాటిల్

విశాలాంధ్ర, పార్వతీపురం: జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వాసన్ విద్యా సాగర్ నాయుడుకు బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఆయన స్థానంలో విజయనగరం 5వ బెటాలియన్ కమాండెంటుగా పనిచేస్తున్న విక్రాంత్ పాటిల్ ను పార్వతీపురం మన్యంజిల్లా ఎస్పీగా నియామకం చేసినట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విక్రాంత్ పాటిల్ బార్య దీపిక పాటిల్ విజయనగరం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా నియమించబడిన విక్రాంత్ పాటిల్ ఉమ్మడిజిల్లాలో 5వబెటాలియన్ కమాండెంటుగా, గతంలో విజయనగరం ఓఎస్ డి గా పనిచేయడం వల్ల విజయనగరం,పార్వతీపురం జిల్లాలపై పూర్తి అవగాహన ఉంది. ఇదిలా ఉండగా కొత్త జిల్లా ఏర్పడిన తరువాత మొదటి ఎస్పీగా గత ఏడాదికాలం నుండి పనిచేసిన విద్యాసాగర్ నాయుడుకు అటు పోలిస్ అధికారులు, సిబ్బందితో పాటు ఇటు జిల్లాప్రజల్లో, జిల్లాలోని ఇతర అధికారులలో, ప్రజాసంఘాల నేతల్లో మంచి అధికారిగా గుర్తింపు పొందారు. జిల్లాలో పోలీస్ పరీక్షల నిర్వాహణలో, ఇతర పరీక్షలు నిర్వహణ సమయంలో ఆయన కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీఎన్నికల్లో కూడా ఆయన అనుసరించిన విధానంతో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. జిల్లాలో నిర్వహించిన స్పందనలో తనదైన ముద్రను వేసుకున్నారు. శాంతి భద్రతలు పరిరక్షణతోపాటు జిల్లాలో ప్రజాసంఘాలు నిర్వహించే ధర్నాలు, రాస్తారోకోలు, బంద్ లు నిర్వహించే సమయంలో నవ్వుతో సమాధానం చెప్పి తనపని తానూ
చట్టప్రకారం చేసేవారు. పాలకొండ ప్రాంతంలో జిల్లా కలెక్టరును రైతులు అడ్డుకున్న సమయంలో కూడా సమయస్ఫూర్తిగా వ్యవహరించి జిల్లా కలెక్టరుతో ఒప్పించి రైతులపై పెట్టిన కేసులు 24గంటల్లో ఉపసంహరణ రాష్ట్రస్థాయిలో మరువలేనిదిగా చెప్పవచ్చును. జిల్లాలో నాటుసారా నియంత్రణపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఎక్కువ కేసులు నమోదు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. జిల్లాలో కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ పరిష్కారం చేయాలని కోరుతూ సిబ్బందికి పూర్తి స్వేచ్ఛని అందజేసేవారు. జిల్లాలో ఉండేటప్పుడు తన కార్యాలయంలో అన్ని వేళలా అందుబాటులో ఉండి అందరి సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించి పరిష్కారం చేయడానికి కృషి చేసే వారు. జిల్లాలో ఎస్పీతో పాటు జాయింట్ కలెక్టర్ ఆనంద్ బదిలీ జిల్లా ప్రజలను నిరుత్సాహ పరిచిందని అందరూ అనుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img