Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశ్ బచావో మోడీ హటావో ….

కమ్యూనిస్టుల ప్రచారోద్యమాన్ని జయప్రదం చేయండి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు.. గుజ్జల
విశాలాంధ్ర – పార్వతీపురం : ప్రజలపై భారాలువేసే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేపడుతున్న కమ్యూనిస్టుల ప్రచారాందోళనలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. సిపిఐ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు అధ్యక్షతన జిల్లాస్థాయి విస్తృత సమావేశం గురువారం పార్వతీపురం ఎన్జీఓ హోంలో నిర్వహించారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ ప్రశ్నించే వారి గొంతుకులను నొక్కుతున్నారని, రూ.12 లక్షల కోట్ల కుంభకోణం చేసిన అదానీని వెనకవేసుకొస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఇసుక ల్యాండ్ వైన్ మైన్ తదితర కుంభకోణాలు చేసి రాష్ట్ర ప్రజల పరిస్థితిని అగాధలకు తీసుకెళ్తుందన్నారు. ప్రత్యేక హోదా గాని ప్రత్యేక ప్యాకేజీ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోయిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నిత్యావసర వస్తువులను పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఎల్ఐసి బ్యాంక్ ప్రభుత్వరంగ సంస్థలను అంబానీ ఆదాని చేతికి బిజెపి ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ఇప్పటికైనా దేశాన్ని కాపాడుకోవాలనే బిజెపి హటావో దేశ్ కో బచావో నినాదంతో గ్రామ గ్రామాన పాదయాత్రలు జీపు జాతలు నిర్వహించాలన్నారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలకు 9 సంవత్సరాలుగా ఏమి చేయలేదన్నారు. నిరుపేదలు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఎరువుల ధరలు తగ్గించాలని ఆసరా పింఛన్లు, పేద ప్రజలకు అందరికీ ఇవ్వాలని ప్రతి ఒక్క పేద ప్రజలకు ఇల్లు నిర్మాణం కోసం ఐదు లక్షల లోను ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలనే డిమాండ్ చేశారు. లేనియెడల గ్రామ గ్రామాన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్తామన్నారు. కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు ఈవి నాయుడు, గరుగుబిల్లి సూరయ్య, కూరంగి గోపి నాయుడు, జిల్లా సమితి సభ్యులు సింహాద్రి దుర్గారావు, సాలాపు అనంతరావు, ఎఐవైఫ్ జిల్లా కార్యదర్శి బిటి నాయుడు, సీనియర్ నాయకులు మండంగి సింగన్న, సత్య ప్రసాద్, ఎలగాడ పైడిశెట్టి, గుజ్జ జనార్దన్, మండంగి గోపాల్, పువ్వల ప్రసాద్, బంగారి, మండంగి నరసింహులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
జంఝావతి రబ్బరుడాం సందర్శన:
మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో గల జంఝావతి డాంను ఈశ్వరయ్య, కామేశ్వరరావు, మన్మధరావు తదితరుల సీపీఐ నేతలు సందర్శించారు. ఆసియాలో రికార్డు సాధించిన రబ్బర్ డాంగా పేరుగాంచిన జంఝావతి ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో దానిద్వారా రైతులకు లాభం లేకుండా పోయిందన్నారు. ఒడిస్సాతో చర్చలు చేస్తామని పాలకులు చెప్పడం తప్ప ఆచరణలో ఒరిగిందేమీ లేదన్నారు. ఇప్పటికైనా ఒడిస్సా ప్రభుత్వంతో చర్చించి దీనిద్వారా రైతులకు సాగునీరు అందించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img