Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రకృతి వ్యవసాయంలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి

జిల్లాలో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి
లక్షా 10వేల ఎకరాలసాగువిస్తీర్ణం లక్ష్యంలో 57 వేల ఎకరాలలో కొనసాగుతున్న సాగు
9238 మహిళా సంఘాల భాగస్వామ్యంశ్రీ
ప్రకృతి వ్యవసాయ సాగులో 37వేల మంది రైతులు
ప్రకృతి వ్యవసాయసాగులో వెలుగు, జట్టు, వాసన్ సంస్థల సహకారం

విశాలాంధ్ర,పార్వతీపురం: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమాజంలో వస్తున్న మార్పులను గమనించి ప్రకృతి వ్యవసాయ సాగుపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని పెద్ద ఎత్తున సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధ్యమని, రైతులు ప్రకృతి సాగు విస్తీర్ణంను పెంచాలని రైతు సాధికారిక సంస్థ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ సంస్థలు రైతులలో  అవగాహన పెంచి సాగు విస్తీర్ణం ఘననీయంగా పెంచేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకొని కార్యక్రమాలు చేస్తున్నారు.  అడిగి తెలుసుకున్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయసాగులోవాడే  ద్రవజీవామృతం, ఘన జీవామృతం,బీజామృతం, నీమాస్త్రం, అజ్ఞాస్త్రం,బ్రహ్మాస్త్రం, తూటికాడ కషాయం, మారేడుపత్ర కషాయం, శొంఠి కషాయం, దశపర్ని కషాయం, సప్త దాన్యాంకుర కషాయం,మీనామృత కషాయం, పుల్లటి మజ్జిగ కషాయం, విత్తన గుళికలు తయారీపై అవగాహణ కల్పించి చైతన్యంను, పరిజ్ఞానంను కలిపించి రైతులను ప్రకృతి వ్యవసాయం సాగులో దృష్టి సారించేల చర్యలు తీసుకొంటున్నారు. దేశవాడీ ఆవుల మూత్రం, పేడతో తయారు చేసే బీజామృతం, ఘన జీవామృతం ప్రక్రుతి వ్యవసాయ సాగులో గణనీయంగా పలితాలు సాధించడం జరుగుతుంది. తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి వస్తుందని రైతులు కూడా తెలుసుకొని ముందుకు వస్తూ ఏపిసిఎన్ఎఫ్ సూచనలు పాటిస్తూ వ్యవసాయ సాగులో ముందుకు సాగుతున్నారు. దీంతోపాటు రసాయన ఎరువులు పురుగు మందులు లేని ఆహార అలవాట్లను ప్రజలు నేడు ఆచరిస్తున్న వేల ప్రక్రుతి వ్యవసాయ సాగులో ముందుకు సాగుతున్నారు.గ్రామాల్లో ఏపీ సిఎన్ఎఫ్ ద్వారా రైతులు సాగుచేస్తున్న ప్రకృతి వ్యవసాయ సాగువిస్తీర్ణం పెంపు, ఉత్పత్తులకు మార్కెటింగ్, ఖరీఫ్, రబీలో పంటలసాగు తదితర అంశాల గూర్చి అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకొంటున్నారు. 
జిల్లాలో ప్రకృతి వ్యవసాయ సాగుపై ప్రత్యేక చర్యలు:
పార్వతీపురం మన్యం జిల్లాలో జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆనంద్,ఇతర జిల్లా అధికారుతోపాటు ప్రజా ప్రతినిధుల సూచనలతో ప్రకృతి వ్యవసాయ సాగుపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని రైతులను చైతన్యం చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖాదికారి రాబర్ట్ పాల్, జిల్లా ప్రకృతి వ్యవసాయం మేనేజర్ కె. షణ్ముఖరాజు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి,వ్యవసాయశాఖ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్, రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఎక్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి. విజయకుమార్, సిఈఓ  రామారావుల అదేశాలు,సూచనలు మేరకు జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 9వేల 238సంఘాలకు చెందిన 53వేల 586మంది రైతులు లక్షా 10వేలఎకరాల విస్తీర్ణంలో సాగును లక్ష్యంగా నిర్ణయించగా ఇంతవరకు 36వేల 846మంది రైతులు 57వేల 900 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్నారని చెప్పారు. అందరిలో మారుతున్న కాలానికి అనుగుణంగా రసాయనఎరువులు, పురుగు మందులులేని పంటలు గూర్చి అన్ని వర్గాల ప్రజలు ఆలోచన చేయడంతో ప్రకృతి వ్యవసాయం సాగుపై రైతులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారని తెలిపారు.
మార్కెటింగుపై కూడా ప్రభుత్వం  పెద్ద ఎత్తున జరిగేలా  తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతీ రోజూ రైతులతో మాట్లాడి ప్రకృతి వ్యవసాయ సాగును, కలిగేలాభాలను సిబ్బంది చైతన్యం చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ప్రకృతి వ్యవసాయసాగులోవాడే  ద్రవజీవామృతం, బీజామృతం, విత్తన గుళికలు తయారీ, వివిధ కషాయల తయారీని ఎక్కువ మంది రైతులు నేర్చుకొని తక్కువ ఖర్చుతో కూడిన ప్రకృతి వ్యవసాయం సాగుపై దృష్టి సారిస్తున్నారని చెప్పారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా వరి, అపరాల పంటల సాగు,  కూరగాయల పంటలను పండించడంతో పాటు వాటి దిగుబడి బాగుంటుందని తెలిపారు.సకాలంలో వాటి అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయన్నారు. దీంతో పాటు రైతులకు ఖరీఫ్ సీజనుకు ముందు పొలాల్లో పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు జల్లడం వల్ల పెరిగే భూసారం గూర్చి కూడా అవగాహణ పెంచడం జరుగుతుందని తెలిపారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయ సాగులో చిరుధాన్యాల సాగ పై ప్రత్యేక శ్రద్ద తీసుకొని రైతులను చైతన్యం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయ సాగు ద్వారా పండిస్తున్న పంటలు  పార్వతీపురం, కురుపాం, సాలూరు తదితర రైతుబజారులలో  విక్రయించే ఏర్పాట్లుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయ సాగులో వెలుగు, జట్టు, వాసన్ వంటి సంస్థలతో  ఒప్పందం చేసుకొని జిల్లాలో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రీజనల్ తెమాటిక్ లీడ్ అధికారి ప్రకాష్, రీజనల్ టెక్నికల్ ఆఫీసర్ హేమసుందర్ సూచనలు సలహాలు పాటిస్తూ వ్యవసాయ సాగులో రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ సాగులో జిల్లాలో జిల్లా మేనేజర్, అదనపు మేనేజర్, ఎన్ఎఫ్ఏ, డిజిటల్ మాస్టర్ ట్రైనర్ మరియు సిబ్బంది ఉండగా ప్రతీ మండలానికి ఒక ఫీల్డ్ మాస్టర్ ట్రైనర్, మండలంలోని క్లస్టర్ కు ఒక సిఆర్పి, గ్రామ స్థాయిలో ఐసిఆర్పిలు ఉండి రైతులకు ప్రకృతి వ్యవసాయ సాగులో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల
ఐటీడిఏలో చిరుధాన్యాలు సదస్సులో ఏపిసిఎన్ఎఫ్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాళ్లును జిల్లా కలెక్టర్ చూసి వారి సాగు గూర్చి అడిగి సంతృప్తి వ్యక్తంచేశారు. దీంతోపాటు పార్వతీపురం మండలంలోని బొండపల్లిలో ప్రకృతి వ్యవసాయ సాగును ఆకస్మికంగా సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఆనంద్ అన్ని అంశాలను పరిశీలించి రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ సాగుపై ఆరా తీశారు. వారు చెప్పిన మాటలు విని ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. రైతులంతా తక్కువ ఖర్చుతో అదిక దిగుబడి సాధించే దిశగా అడుగులు వేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని సాగుచేసి అధిక లాభాలను ఆర్జించాలని హితవు పలికారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రకృతి వ్యవసాయ సాగులో పంటలతోపాటు కాయగూరలు, ఆకుకూరలను చూసి వాటిఉత్పత్తులు పెంచే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. రైతులకు గ్రామాల్లో ఉండే రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నిరకాల సేవలు అందించే చర్యలు తీసుకుంటామని చెప్పారు. సచివాలయంలలో పనిచేసే వ్యవసాయ సహాయకులు కూడా ప్రకృతి వ్యవసాయ సాగుపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు, సూచనలు మేరకు వారుకూడా లక్ష్యాల సాధనకు కృషిచేయాలని తెలిపారు. వెలుగు, జట్టు వంటి సంస్థలతోచేసుకున్న  ఒప్పందంతో రైతులు కూడా పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయ సాగుపై దృష్టి సారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img