Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రముఖ కథా రచయిత గౌరునాయుడుకు పతంజలి పురస్కారం: .భీశెట్టిబాబ్జి

విశాలాంధ-విజయనగరం : ప్రముఖ రచయిత,సీనియర్ పాత్రికేయుడు,అనేక పత్రికలకి సంపాదకులుగా పనిచేసిన స్వర్గీయ కె.ఎన్.వై. పతంజలి పేరున ప్రతీ ఏడాది అందించే పురస్కారంను ఈ ఏడాది ప్రముఖ కథా రచయిత గంటేడ గౌరునాయుడుకి ఇస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. ఈనెల 29న బుధవారం నాడు జిల్లా కేంద్రంలోని గురజాడ పబ్లిక్ స్కూల్లో ప్రఖ్యాత రచయిత ఉత్తరాంధ్ర యాస బాసలతో అనేక కధలు,యువకులకు మార్గసందేశం అందించే ఁపాడుదమా స్వేచ్ఛా గీతంఁలాంటి గొప్ప జాతీయ గీతం రాసిన గంటేడ గౌరునాయుడికి అంద చెయ్యడం జరుగుతుందని పతంజలి సాంస్కృతిక వేదికఅధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు.గురువారం గురజాడ అప్పారావు స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయనమాట్లాడుతూ వేదిక ప్రతినిధులకమిటీ గౌరునాయుడి పేరుని సూచించిందనిఅన్నారు. స్నేహ కళా సాహితీని స్థాపించి ఉత్తరాంధ్ర నుండి ఎందరో కవుల్ని, కధకుల్ని తయారుచేసిన ఘనత గౌరునాయుడి మాస్టారికే దక్కుతుందని భీశెట్టి అన్నారు. వేదిక కార్యదర్శి ఎన్. కె.బాబు మాట్లాడుతూ పతంజలిపేరుతో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రముఖ రచయితలు మోహన్, మహర్షి, దేవిప్రియ,సతీష్ చంద్ర, చింతికింది, అట్టాడ అప్పలనాయుడు, పప్పు అరుణలకు అందచేసామన్నారు.2023లో పార్వతీపురంకు చెందిన గంటేడ గౌరునాయుడుకి ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. ఈనెల 29న జరిగే కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పురస్కార ప్రదానం కార్యక్రమంలో సాహితీవేత్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులుపాల్గొని సభని విజయవంతం చేయాలనికోరారు .
ఈసమావేశంలో వేదిక ప్రతినిధులు జలంత్రి రామచంద్రరాజు,ఇప్పలవలస గోపీ,గురజాడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img