Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బలిజిపేటలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు

విశాలాంధ్ర, పార్వతీపురం: తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను బలిజిపేటమండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండలపార్టీ అద్యక్షులు పెంకి వేణుగోపాల నాయుడు, టీడీపి నియోజక వర్గ నాయకులు వాడాడ రాముల ఆద్వర్యంలో కార్యాలయంవద్ద పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. కేకుని కోసి జన్మదిన వేడుకలును ఘనంగా నిర్వహించారు.క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును రానున్న సాధారణ ఎన్నికలలో ముఖ్యమంత్రి చేసేందుకు అంతా కలిసికట్టుగా పనిచేద్దామని నాయకులంతా ముక్తకంఠంతో తెలిపారు. ఆయన పార్టీకీ,రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈకార్యక్రమంలో అన్ని గ్రామాల టీడీపీ నాయకులు,అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img