Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

బ్యాలెట్ బాక్స్ లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

విశాలాంధ్ర..పార్వతీపురం: మార్చి 13న జరగనున్న శాసనమండలి పట్టభద్రుల ఎన్నికకు వినియోగించేందుకు కలెక్టర్ కార్యాలయంలో భద్రపరిచిన బ్యాలెట్ పెట్టెలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం పరిశీలించారు. ఎన్నికల అధికారులతో బ్యాలెట్ పెట్టెలలను ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాటుచేసే బస్సులను ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నిలిపేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావును ఆదేశించారు. ఎన్నికల అనంతరం బ్యాలెట్ పెట్టెలను తాత్కాలికంగా భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూం ఏర్పాటుకు అవసరమైన చర్యలను చేపట్టాలని సూచించారు. బ్యాలెట్ బాక్సుల భద్రతకు, విశాఖపట్నం పంపించుటకు అవసరమైన చర్యలు, బందోబస్తు ఏర్పాటుచేయాలని ఆయన ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరుగుటకు పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు.
ఎన్నికల నోటీసు జారీ:
శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్టణం పట్టభద్రుల నియోజక వర్గం ఎన్నికకు సంబందించి ఎన్నికల నోటీసు జిల్లాలోని ఆన్ని మండల్లాలో జారీచేసి నోటీసుబోర్డులోపెట్టారు.గురువారం నుండి ఈనెల 23లోగా విశాఖపట్టణం
జిల్లాకలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించాలని తెలిపారు. విశాఖ జిల్లా కలెక్టర్ లేదా జిల్లా రెవెన్యూ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించాలని తెలిపారు. ఈనెల 24న పరిశీలన జరుగుతుందని, 27లోగా నామినేషన్ ఉపసంహరణకు గడువని నోటీసులో తెలిపారు.ఎన్నికలకు పోటీ ఉన్నచో మార్చి 13న ఉదయం 8గంటల నుండి 4గంటల మధ్య పొలింగు ఉంటుందని రిటర్నింగ్ అధికారి,విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ నోటీసులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మన్యం జిల్లాలో 24కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుందని జిల్లా అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img