Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మోడల్ కోడ్ పర్యవేక్షణకు ఫ్లైయింగ్ స్క్వాడ్స్

జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి
విశాలాంధ్ర= విజయనగరం :
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల ఎం.ఎల్.సి ఎన్నికకు సంబంధించి మోడల్ కోడ్ అమలును పర్యవేక్షించడానికి జిల్లాలో మండలానికో ఫ్లైయింగ్ స్క్వాడ్ ను నియమించినట్లు జిల్లాఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఒక ప్రకటన లో తెలిపారు. ప్రతి మండలం లో మోడల్ కోడ్ అమలును పర్యవేక్షించడానికి హెచ్.డి.టి ఆధ్వర్యం లో ఈ.ఓ.పి.ఆర్.డి , పోలీస్ కాన్స్ టేబుల్ , వీడియో గ్రాఫర్ తో కూడిన కమిటిలను నియమించినట్లు తెలిపారు. అదే విధంగా ప్రతి మండలం లో ఈ.ఓ.పి.ఆర్.డి లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ బృందాలు అన్ని గ్రామాలను, వార్డ్ లలోను సందర్శించి క్షేత్ర స్థాయి సమావేశాలు నిర్వహించి మోడల్ కోడ్ అమలు పై తగు సూచనలను అందించాలన్నారు. ఫ్లెక్షి లు, బ్యానర్లు , బోఅర్డ్స్ , వాల్ పెయింటింగ్స్ , గోడల పై రాతలను సంబంధిత పార్టీలు, భవన యజమానులు తొలగించాలని, లేని యెడల నోటీసు లు జరీ చేయాలనీ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ మోడల్ కోడ్ వెంటనే అమలులోకి వస్తుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img