Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రక్తదానంచేసి ప్రాణదాతలు కండి:

జిల్లా కలక్టర్ నిషాంత్ కుమార్
విశాలాంధ్ర,పార్వతీపురం/బెలగాం: ప్రతీ ఒక్కరు రక్తదానంచేసి ప్రాణదాతలు కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కోరారు. గురువారంనాడు జిల్లా అగ్నిమాపక కార్యాలయం ఆద్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు.ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం చేయడంవలన ఆపదలోగల మరొకరిప్రాణం కాపాడటం జరుగుతుందని,దీనిని అర్థంచేసుకొని ప్రతీ ఒక్కరు రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడంద్వారా బలహీన పడతామనే అపోహనువీడాలని, రక్తదానం చేయడం వలన మరింత ఉత్సాహంగా ఉంటారని తెలిపారు. ఆరోగ్య వంతుడైన ప్రతీ వ్యక్తి మూడునెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చునన్నారు.ఆన్ని దానాల్లో రక్తదానం మిన్న అని అన్నారు.రానున్న వేసవిలో రక్త నిల్వలు తగ్గుతాయని, దానినిదృష్టిలో పెట్టుకొని యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. దీనిపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. రక్తదాతలను జిల్లా కలెక్టర్ అభినందించారు.
ఈకార్యక్రమం ద్వారా 30యూనిట్లు రక్తం సేకరించినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదానశిబిరంలో అగ్నిమాపక సిబ్బంది, భాస్కర డిగ్రీ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని రక్తదానం చేసారు.
ఈకార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.వాగ్దేవి, డాక్టర్. హరిజగన్, బ్లడ్ బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img