Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాష్ట్ర ప్రభుత్వ స్పందనపై దన్యవాదాలు

విశాలాంధ్ర,సీతానగరం: మన్యంజిల్లా విద్యాశాఖాధికారి డాక్టరు ఎన్ డి వి రమణ మరో ఆరుగురు ఉద్యోగుల సస్పెన్సన్ల వ్యవహారంపై రాష్ట్రముఖ్యమంత్రి స్పందించి మన్యం జిల్లా కలెక్టరుకు సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ అదేశాలు జారీచేయడం పట్ల రాష్ట్ర ఏపీటీఎఫ్ మహిళా కౌన్సిలర్, ఫ్యాఫ్టో సభ్యురాలు, కోటసీతారాంపురం ప్రాదమికోన్నత పాటశాల ప్రదానోపాధ్యా యరాలు చుక్క శ్రీదేవి ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.విద్యాశాఖలో జిల్లా విద్యా శాఖాధికారి డాక్టరు రమణ లాంటి అధికారులు అరుదని, అటువంటి వ్యక్తి సస్పెన్షన్ మన్యం జిల్లా ఉపాధ్యాయ లోకం జీర్ణించుకోలేక అన్ని సంఘాల ఆద్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీకీ అన్ని సంఘాలకు చెందిన ఉపాధ్యాయసిబ్బంది పెద్దఎత్తున తరలిరావడంతో ప్రభుత్వం జిల్లా కలెక్టరును చర్చలు జరిపి న్యాయబద్ధంగా పరిష్కారం చేయాలని ఆదేశించడం శుభపరిణామమన్నారు. సత్వరమే డిఈఓ, ఇతర ఉద్యోగుల సస్పెన్షన్ ఉత్తర్వులు ఎత్తివేసి న్యాయం చేయాలని ఆమె కోరారు.సోమవారం జరిగిన ర్యాలీకు పెద్ద ఎత్తున వివిధ సంఘాలకు చెందిన ఉపాధ్యాయులతోపాటు మహిళా ఉపాధ్యాయ సిబ్బంది, ఎన్ జి ఓ యూనియన్ నాయకులు పాల్గొని విజయవంతం చేయటంపట్ల వారికి కృతజ్ఞతలు తెలిపారు.
స్వాగతం పలికిన వివిధ సంఘాల నాయకులు:
డిఈఓ, ఇతర ఉద్యోగుల సస్పెన్షన్ ఉత్తర్వులపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టరును ఆదేశించడం, ఆయన ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం శుభ పరిణామమని పి ఆర్ టి యు, ఏపీటీఎఫ్ మన్యం జిల్లా అధ్యక్షులు వోలేటి తవిటినాయుడు, మరడాన శివున్నాయుడు, రాష్ట్ర ఏపీటీఎఫ్ రాష్ట్రనేత దాసరి వెంకట నాయుడులు తెలిపారు. వారితో పాటు మండల పిఆర్టియు అధ్యక్ష, కార్యదర్శులు మరిశర్ల జగదీష్, అలజింగి నాగ భూషణరావు, ఏపిటిఎఫ్ అద్యక్ష కార్యదర్శులు తట్టికోట గౌరునాయుడు, పోల సత్యనారాయణ, యుటిఎఫ్ అద్యక్ష కార్యదర్శులు ఒమ్మి రామకృష్ణ, పల్లి శ్రీనివాసరావులు కూడా స్వాగతము పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img