Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వన్ ధన్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: ఐటీడిఏ పిఓ విష్ణు చరణ్

విశాలాంధ్ర, కురుపాం : వన్ ధన్ వికాస్ కేంద్రాలు (వి.డి.వి.కె) ను సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్ అన్నారు. కురుపాంమండలం మొండెంఖల్లు, తిత్తిరి, గుజ్జివాయి గ్రామాల్లో వి.డి.వి.కెలను ప్రాజెక్టు అధికారి మంగళవారం పరిశీలించారు. వి.డి.వి.కెలలో అటవీ ఫలసాయాలను విలువ ఆధారిత జోడించి విక్రయించాలని సూచించారు. కొండ చీపుర్లు, వివిధ రకాల పంటలు కేవలం గిరిజన ప్రాంతాల్లో మాత్రమే లభ్యం అవుతాయని పేర్కొన్నారు. సహజ సిద్దంగా పండుతాయని, వాటికి విలువ ఆధారిత జోడించడం వల్ల మెరుగైన ఆదాయం లభిస్తుందని చెప్పారు. వి.డి.వి.కె సభ్యులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మార్కెట్ లో ఉత్పత్తులు, ధరలు, డిజైన్లు పరిశీలించి అందుకు అనుగుణంగా ఉత్పాదకాలు చేయుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ అవసరమగు అన్ని సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో గిరిజన ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ఏపిడి వై. సత్యం నాయుడు, ఏపిఎంలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img